AIIMS | ఎంపాక్స్ చికిత్స ప్రొటోకాల్‌పై ఎయిమ్స్ కీలక అప్‌డేట్
ప్రపంచ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న ఎంపాక్స్ వైరస్‌పై భారతదేశం కూడా అప్రమత్తమైంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాలకు హెచ్చరికలు, మార్గదర్శకాలు జారీ చేసింది.

ప్రపంచ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న ఎంపాక్స్ వైరస్‌పై భారతదేశం కూడా అప్రమత్తమైంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాలకు హెచ్చరికలు, మార్గదర్శకాలు జారీ చేసింది. చికిత్స లేని ఈ వైరస్‌కు చికిత్స చేసే సమయంలో పాటించాల్సిన ప్రొటోకాల్‌పై ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) మంగళవారం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ వైరస్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తున్న మెడికల్ ఎమర్జెన్సీగా డబ్ల్యూహెచ్‌వో ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి భారతదేశంలో ఎంపాక్స్ వైరస్ సోకిన కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదు. అయినా పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తున్నది. ఈ క్రమంలోనే చికిత్సా విధానంపై ఎమర్జెన్సీ విభాగానికి మార్గదర్శకాలు జారీ చేసింది. ‘జ్వరం, దద్దుర్లు, లేదా ఎంపాక్స్ బాధితులతో కాంటాక్ట్ కలిగిన పేషెంట్ రాగానే సత్వరమే అతడి ఆరోగ్యాన్ని పరీక్షించాలి’ అని మార్గదర్శకాల్లో పేర్కొన్నది. పేషెంట్‌లో కీలక లక్షణాలైన జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, వెన్ను నొప్పి, వాపులు, చర్మంపై పొక్కులు వంటి వాటిని పరిశీలించాలని తెలిపింది. ఇతర రోగులు, సిబ్బందికి సాధ్యమైనంత తక్కువ కాంటాక్ట్ ఉండేలా పేషెంట్‌ను నిర్దిష్ట ఐసోలేషన్ వార్డుకు తరలించాలి. ఎంపాక్స్ అని పరీక్షలు నిర్ధారిస్తే.. వెంటనే ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రాం అధికారులకు పేషెంట్ సమాచారం అందించాలి. అందులో అతడి నేపథ్యం, పరీక్షల్లో వెల్లడైన అంశాలు, కాంటాక్ట్ వివరాలు తెలియజేయాలి. ఎంపాక్స్ పేషెంట్స్‌కు చికిత్స కోసం సఫ్దర్ జంగ్ హాస్పిటల్‌ను ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో ఏ హాస్పిటల్‌లోనైనా అనుమానిత లక్షణాలు కలిగినవారు చేరితే వారిని సఫ్దర్ జంగ్ హాస్పిటల్‌కు రిఫర్ చేయాలని మార్గదర్శకాల్లో సూచించారు. పేషెంట్లతో వ్యవహరించేటప్పుడు ఇన్ఫెక్షన్ నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలి. సిబ్బంది తప్పనిసరిగా పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్ మెంట్ (పీపీఈ)ను ధరించాలని తెలిపింది.
ఎంపాక్స్ వైరస్ సోకినవారికి జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులతోపాటు.. చర్మంపై నీటి పొక్కు లు ఉంటాయి. ఈ వైరస్ ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి తాకడం, నోటి తుంపర్ల ద్వారా సోకుతుంది. ఎంపాక్స్ వైరస్‌లో తీవ్రమైన స్ర్టెయిన్ గతంలో కాంగో దేశంలో అల్లకల్లోలం రేపింది. ఇప్పుడు కెన్యా ద్వారా ఇతర ఆఫ్రికా దేశాల్లో వేగంగా విస్తరిస్తున్నది. దీంతో అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.