Air Pollution Is Stealing Over 1,000 Days | వాయు కాలుష్యంతో వెయ్యి రోజులు తగ్గనున్న ఆయుష్షు

భారతదేశంలో తీవ్ర వాయు కాలుష్యం కారణంగా ప్రతి వ్యక్తి ఆయుష్షు సగటున వెయ్యి రోజులు తగ్గుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక వెల్లడించింది. ఢిల్లీలో కాలుష్యం అత్యధికం.

Air Pollution Is Stealing Over 1,000 Days | వాయు కాలుష్యంతో వెయ్యి రోజులు తగ్గనున్న ఆయుష్షు

భారత దేశంలో నివసిస్తున్న వారిలో ఎక్కువ మంది మెజారిటీ కాలుష్యమైన గాలిని పీలుస్తున్నారు. దీంతో వారి ఆయుష్షు కూడా తగ్గుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల విడుదల చేసిన నివేదిక ఈ విషయాలను బయటపెట్టింది. స్వచ్ఛమైన గాలిని పీల్చే వారి ఆయుష్షు పెరిగే అవకాశం ఉంది. వాయు కాలుష్యం వల్ల ప్రతి ఒక్కరి జీవితంలో వెయ్యి రోజులు తగ్గే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి.

ఇండియాలో పెరిగిన వాయు కాలుష్యం

ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారంగా 2022 తో పోలిస్తే 2023లో గాలిలో పీఎం 2.5 స్ధాయి పెరిగిందని తేలింది. సగటున భారతీయులు పీల్చే గాలి ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన మార్గదర్శకాల కంటే ఎనిమిదిరెట్లు ఎక్కువ కలుషితమైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నియమాల మేరకు స్వచ్ఛమైన గాలితో సగటు ఆయుష్షు 3.5 సంవత్సరాలు పెరిగే అవకాశం ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2021 సూచనల ప్రకారం గాలిలో క్యూబిక్ మీటర్ కు 5 మైక్రో గ్రాములు, పీఎం10కి 15 మైక్రో గ్రాములు ఉండవచ్చు. కానీ, ఇండియాలో మాత్రం పీఎం 2.5 కి 40 మైక్రో గ్రాములు, పీఎం 10 కి 60గా ఉన్నాయి.

ఉత్తరాది రాష్ట్రాల్లో కాలుష్యం ఎక్కువ

భారత్ లోని 39 శాతం మంది ప్రజలు ఎక్కువగా గాలి కాలుష్యంతో ఇబ్బందులకు గురౌతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మేరకు గాలి స్వచ్ఛంగా ఉంటే ఈ ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఐదేళ్లు ఎక్కువ కాలం నివసిస్తారు. ప్రపంచంలో అత్యంత వాయు కాలుష్యం ఉన్న నగరాల్లో ఢిల్లీ ఒకటి అని ఈ రిపోర్టు చెబుతోంది. భారతదేశ జనాభాలో ఉత్తర భారతంలో నివసించేవారిలో దాదాపు 39% మంది నివసించే ప్రజలు ఎక్కువగా వాయు కాలుష్యంతో బాధపడుతున్నారని నివేదిక తెలిపింది.. గాలి నాణ్యత ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటే ఈ ప్రాంత ప్రజలు సగటున ఐదు సంవత్సరాలు ఎక్కువ కాలం జీవించవచ్చు. పరిశుభ్రమైన గాలి ద్వారా ఒక మనిషి ఆయుష్షు కనీసం 8 ఏళ్లే పెరిగే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర సహా ఇతర రాష్ట్రాల్లో ప్రజలు వాయు కాలుష్యంతో ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నాయి. కాలుష్యాన్ని సురక్షితమైన స్థాయికి తగ్గిస్తే ఆయుర్దాయం కనీసం మూడు సంవత్సరాలకు పైగా పెరిగే అవకాశం ఉంది.

నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం

దేశంలోని పలు రాష్ట్రాల్లో గాలి కాలుష్యం పెరిగింది. దీంతో గాలి నాణ్యతను పెంచేందుకు 2019లో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం ఎన్ సీఏపీని భారత ప్రభుత్వం ప్రారంభించింది. గాలి నాణ్యత ప్రమాణాలను పెంపునకు చర్యలను చేపట్టారు. దేశంలోని 131 నగరాల్లో గాలి కాలుష్యం 10.7 శాతం తగ్గింది.2017తో పోలిస్తే 445 మిలియన్ల మందికి ఆరు నెలల ఆయుష్షు పెరిగింది. 103 నగరాల్లో సానుకూల ఫలితాలు కనిపించాయి. 22 నగరాలు నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం నిబంధనలకు చేరుకున్నాయి. వాయు కాలుష్యం అంటే కేవలం పొగమంచు లేదా దగ్గు మాత్రమే కాదు. ఇది ఆయుష్షును తగ్గిస్తుంది.

వాయు కాలుష్యంలో ఢిల్లీ టాప్

వాయు కాలుష్యంలో ఢిల్లీ టాప్ లో ఉంది. ప్రపంచంలో దక్షిణాసియాలో ఎక్కువగా వాయు కాలుష్యం ఎక్కువగా ఉందని నివేదికలు చెబుతున్నాయి. దీని ప్రభావం పిల్లలపై ఎక్కువగా కనిపిస్తోంది. పోషకాహార లోపం, సురక్షిత నీరు, పారిశుధ్యం సరిగా లేకపోవడం, చేతులు కడుక్కోకపోవడం వంటి వాటితో వచ్చే నష్టాల కంటే స్వచ్ఛమైన గాలి లేకపోవడంతో ఐదు రెట్లు ఎక్కువ నష్టం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దక్షిణాసియాలో భారత్ తర్వాత బంగ్లాదేశ్ లో ఎక్కువగా వాయు కాలుష్యం ఉంది. అయితే ఢిల్లీ కంటే ఢాకాలో వాయు కాలుష్యం తక్కువ అని నివేదికలు వెల్లడిస్తున్నాయి