Bengaluru Cyber Crime : బెంగళూరు లో ప్రతిరోజు రూ.5.45 కోట్ల డిజిటల్ మోసం

బెంగళూరులో సైబర్ నేరాలు కలకలం రేపుతున్నాయి. 2024లో రూ.1,995 కోట్లు, 2025లో ఇప్పటిదాకా రూ.1,543 కోట్ల దోపిడీ జరిగింది. రోజుకు సగటున రూ.5 కోట్ల మేర ప్రజలు నష్టపోతున్నారు

Bengaluru Cyber Crime : బెంగళూరు లో ప్రతిరోజు రూ.5.45 కోట్ల డిజిటల్ మోసం

బెంగళూర్ మహానగరంలో సైబర్ నేరాలు పెరుతున్నాయి. సైబర్ మోసగాళ్లు పెట్రేగుతున్నారు. బెంగళూర్ నగరంతో పోల్చితే గ్రామీణ ప్రాంతాలలో డిజిటల్ ఫ్రాడ్ ప్రభావం అంతగా లేదు. ఫలితంగా నగర ప్రజలు కోట్లాది రూపాయలు ఆర్థికంగా నష్టపోతున్నారు. 2024 సంవత్సరంలో సైబర్ మోసాల కారణంగా రూ.1,995 కోట్లు నష్టపోగా, ప్రతిరోజు సగటున రూ.5.45 కోట్లు కోల్పోయినట్లు తేలింది. 2025 లో ప్రతి రోజు సగటున రూ4.83 కోట్లు నష్టపోయారు. సైబర్ నేరాలపై కర్నాటక అసెంబ్లీలో హోం శాఖ మంత్రి జి.పరమేశ్వర సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు.

ఈ ఏడాది నవంబర్ 15వ తేదీ నాటికి ఒక్క బెంగళూర్ నగరంలోనే సైబర్ నేరాల్లో రూ.1,543 కోట్లు నష్టపోయారని వివరించారు. గత ఏడాది రూ.1995 కోట్లు నష్టపోగా, గ్రామీణ ప్రాంత ప్రజలు మాత్రం రూ.49.85 కోట్లు మాత్రమే డబ్బులు కోల్పోయారని అన్నారు. ఫిషింగ్ ఈ మెయిల్స్, కార్డు స్కిమ్మింగ్, ఓటీపీ ఫ్రాడ్స్ వంటి మోసాల ద్వారా ప్రజల నుంచి సైబర్ క్రిమినల్స్ కోట్ల రూపాయల డబ్బులు కొల్లగొడుతున్నారన్నారు. ఇవన్నీ ఆన్ లైన్ ద్వారానే ఎక్కువగా జరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా లేకపోవడంతోనే వాళ్లు రెచ్చిపోతున్నారన్నారు. ఈ మధ్య కాలంలో ముందూ వెనకా ఆలోచించకుండా, సంస్థల పనితీరును తెలుసుకోకుండా స్వల్ప కాలంలో ఎక్కువ డబ్బులు సంపాధించాలనే ఉద్ధేశంతో షేర్ మార్కెట్ యాప్ లలో పెట్టుబడులు పెట్టి పలువురు మోసపోతున్నారన్నారు. ప్రముఖ స్టాక్ మార్కెట్ కంపెనీల పేరుతో నకిలీ మొబైల్ యాప్ లు తయారు చేసి ప్రజల బలహీనతలను సొమ్ముచేసుకుని కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారన్నారు. ఇదే కాకుండా ఈ మధ్యకాలంలో డిజిటల్ అరెస్టు పేరుతో బ్యాంకు ఖాతాలలో డబ్బులున్న వారిని లక్ష్యంగా చేసుకుని కోట్లు తమ ఖాతాలో వేయించుకుంటున్నారని హోం మంత్రి వెల్లడించారు. ఇలా వచ్చిన డబ్బులను క్రిఫ్టో కరెన్సీ, మ్యూల్ ఖాతాల ద్వారా విదేశాలకు మళ్లిస్తున్నారు. నకిలీ పోలీసులు, ఈడీ అధికారులు, ప్రభుత్వ కార్యాలయాల సెటప్ వేసుకుని మరీ ఆన్ లైన్ దోపిడీలకు పాల్పడుతున్నారు. ఇలాంటి మోసాలలో పలువురు డబ్బును కోల్పోవడమే కాకుండా, మానసికంగా కుంగిపోతున్నారని హోం మంత్రి పరమేశ్వర అన్నారు.

ఇవి కూడా చదవండి :

AP Paperless Governance : ఆంధ్రప్రదేశ్ లో జనవరి 15నుంచి ఈ పాలన
VB-G RAM-G Bill : ‘వీబీ జీ రామ్ జీ’ బిల్లుకు లోక్‌సభ ఆమోదం