Bengaluru Road Accident : రోడ్డు ప్రమాదంలో డాన్సర్ సుధీంద్ర మృతి

బెంగళూరులో రోడ్డు ప్రమాదంలో రియాల్టీ షో డాన్సర్ సుధీంద్ర మృతి. కొత్త కారు చెక్ చేస్తుండగా ట్రక్కు ఢీ కొట్టింది. సీసీటీవీ ఫుటేజీ వైరల్.

Bengaluru Road Accident : రోడ్డు ప్రమాదంలో డాన్సర్ సుధీంద్ర మృతి

విధాత : బెంగుళూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో రియాల్టీ షో డాన్సర్ సుధీంద్ర(36) దుర్మరణం చెందాడు. కొత్తగా కొనుగోలు చేసిన కారుని సోదరుడికి చూపించి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకోవడం విచారకరం. కారులో సమస్య ఉండటంతో.. నేషనల్ హైవేపై కారును పక్కకు ఆపి సుధీంద్ర పరిశీలిస్తున్నాడు. అదే సమయంలో
వెనుక నుంచి దూసుకొచ్చిన ఓ ట్రక్కు సుధీంద్రను ఢీకొట్టింది. ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలై అక్కడే కుప్పకూలిపోయాడు.

స్థానికులు వెంటనే సుధీంద్రను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ డాన్సర్ సుధీంద్ర ప్రాణాలు వదిలాడు. ప్రమాద దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఎంతో భవిష్యత్తు ఉన్న డాన్సర్ సుధీంద్ర దుర్మరణం పట్ల కన్నడ సినీ పరిశ్రమ దిగ్బ్రాంతిని వ్యక్తం చేసింది. ఈ ప్రమాదానికి ట్రక్కు డ్రైవర్ నిద్ర మత్తు డ్రైవింగ్ కారణమని పోలీసులు గుర్తించారు. సీసీ టీవీ ఫుటేజీ అధారంగా అతడిని గుర్తించి అరెస్టు చేశారు.