Lord Ganesh | ట్రైన్‌లో గ‌ణేషుడికీ ఓ బెర్త్‌.. ఉద‌యం, సాయంత్రం పూజ‌లు

భార‌త్ గౌర‌వ్ టూరిస్ట్ రైల్లో (Bharat Gaurav Tourist Train) ఏకంగా వినాయ‌కుడికి గుడే ఏర్పాటు చేశారు. ప్ర‌త్యేకంగా ఓ బెర్త్ కేటాయించి అందులో గ‌ణేషుడిని (Ganesh Has His Own Berth) ప్ర‌తిష్ఠించారు. రోజూ ఉద‌యం, సాయంత్రం గ‌ణేషుడికి ప్ర‌త్యేకంగా పూజ‌లు, హార‌తులు ఇవ్వ‌డం విశేషం.

Bharat Gaurav Tourist Train

Lord Ganesh | సాధార‌ణంగా రైలు అన‌గానే మ‌న‌కు ఏం గుర్తుకొస్తుంది.. ర‌ద్దీనే క‌ద‌. భార‌తీయ రైల్వేలు నిత్యం ర‌ద్దీతో నిండిపోయి ఉంటాయి. జ‌న‌ర‌ల్ బోగీల ప‌రిస్థితైతే చెప్ప‌న‌క్క‌ర్లేదు. కూర్చోడానికి కూడా ప్లేస్ ఉండ‌దు. ఇసుకేస్తే రాల‌నంత జ‌నంతో కంపార్ట్‌మెంట్స్ నిండిపోయి ఉంటాయి. అయితే, ఓ రైలు మాత్రం ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తోంది. ఎందుకంటే ఆ రైల్లో జ‌నాల‌తోపాటూ ఓ ప్ర‌త్యేక అతిథి ప్ర‌యాణిస్తాడు మ‌రి. ఆ అతిథి ఎవ‌ర‌నుకుంటున్నారు.. మ‌న గ‌ణేషుడు (Lord Ganesh) (వినాయకుడు).

ఏంటి.. ఇది విని షాక్ అవుతున్నారా..? మీరు విన్న‌ది నిజ‌మే. ఓ రైలులో ఏకంగా వినాయ‌కుడికి గుడే ఏర్పాటు చేశారు. ప్ర‌త్యేకంగా ఓ బెర్త్ కేటాయించి అందులో గ‌ణేషుడిని (Ganesh Has His Own Berth) ప్ర‌తిష్ఠించారు. రోజూ ఉద‌యం, సాయంత్రం గ‌ణేషుడికి ప్ర‌త్యేకంగా పూజ‌లు, హార‌తులు ఇవ్వ‌డం విశేషం. ఈ డివోష‌న‌ల్ సీన్‌.. భార‌త్ గౌర‌వ్ టూరిస్ట్ రైల్లో (Bharat Gaurav Tourist Train)ని ప్ర‌యాణికుల‌కు మాత్ర‌మే క‌నిపిస్తుంది. దీన్ని క‌దిలే గుడిగా అభివ‌ర్ణిస్తున్నారు.

రైలు ప్ర‌త్యేక‌త‌..

ఈ రైలు సాధార‌ణ రైళ్ల‌లా కాదు. కేవ‌లం తీర్థ‌యాత్ర ప‌ర్యట‌న‌ల కోసం మాత్ర‌మే ప్ర‌త్యేకంగా రూపొందించారు. ఈ రైల్లో మొత్తం ఎనిమిది స్లీప‌ర్ కోచ్‌లు ఉంటాయి. అందులో ఓ 3AC కోచ్, ఒక 2AC కోచ్, ఒక ప్యాంట్రీ కారు, రెండు SLR కోచ్‌లు ఉన్నాయి. ఈ రైల్లో మొత్తం 464 మంది ప్ర‌యాణికులు ప్ర‌యాణిస్తారు. అయితే, వారంద‌రికీ రైలు ప్ర‌త్యేక అనుభూతిని అందిస్తోంది. ప్ర‌యాణికులు రైల్లో కీర్త‌న‌లు పాడుతూ ఉత్సాహంగా స‌మ‌యాన్ని గ‌డుపుతారు. ఈ రైల్లోని ఎస్‌-1 కోచ్‌లో ఉన్న 37 బెర్త్‌ను గ‌ణేషుడి కోసం ప్ర‌త్యేకంగా కేటాయించారు. అంతేకాదు, ప్ర‌యాణం ఎలాంటి ఇబ్బందులూ లేకుండా సాఫీగా సాగిపోవాలంటూ ప్ర‌యాణికులు గ‌ణేషుడి వ‌ద్ద పూల‌జు చేయ‌డం విశేషం. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ వైర‌ల్‌గా మారాయి.

ఇవి కూడా చదవండి :

Gold Silver Rates Today | తగ్గిన బంగారం, వెండి ధరలు
Gram Panchayat : తెలంగాణ గ్రామ పంచాయతీలకు రూ.387కోట్లు విడుదల

Latest News