Bhartruhari Mahtab | లోక్‌స‌భ ప్రొటెం స్పీక‌ర్‌గా భ‌ర్తృహ‌రి మ‌హతాబ్

Bhartruhari Mahtab | లోక్‌స‌భ ప్రొటెం స్పీక‌ర్‌గా ఒడిశా( Odisha ) కు చెందిన సీనియ‌ర్ ఎంపీ భ‌ర్తృహ‌రి మ‌హతాబ్( Bhartruhari Mahtab  )నియామ‌కం అయ్యారు. ఈ మేర‌కు రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము( President Droupadi Murmu ) మ‌హ‌తాబ్ చేత ప్ర‌మాణం చేయించారు.

  • By: raj |    national |    Published on : Jun 20, 2024 10:43 PM IST
Bhartruhari Mahtab | లోక్‌స‌భ ప్రొటెం స్పీక‌ర్‌గా భ‌ర్తృహ‌రి మ‌హతాబ్

Bhartruhari Mahtab | న్యూఢిల్లీ : లోక్‌స‌భ ప్రొటెం స్పీక‌ర్‌గా ఒడిశా( Odisha ) కు చెందిన సీనియ‌ర్ ఎంపీ భ‌ర్తృహ‌రి మ‌హతాబ్( Bhartruhari Mahtab  )నియామ‌కం అయ్యారు. ఈ మేర‌కు రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము( President Droupadi Murmu ) మ‌హ‌తాబ్ చేత ప్ర‌మాణం చేయించారు. ఈ విష‌యాన్ని పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి కిర‌ణ్ రిజిజు ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించారు. ఒడిశాలోని క‌ట‌క్ నుంచి ఏడుసార్లు ఎంపీగా గెలుపొందారు భ‌ర్తృహ‌రి. స్పీక‌ర్ ఎన్నిక పూర్త‌య్యే వ‌ర‌కు లోక్‌స‌భ ప్రిసైడింగ్ అధికారిగా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు.

ఇక 18వ లోక్‌స‌భ‌కు కొత్త‌గా ఎన్నికైన స‌భ్యుల‌తో ప్రొటెం స్పీక‌ర్ ప్ర‌మాణం చేయించ‌నున్నారు. భ‌ర్తృహ‌రి మ‌హ‌తాబ్ ఇటీవ‌ల జ‌రిగిన లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీ త‌ర‌పున పోటీ చేసి గెలుపొందారు. ఎన్నిక‌ల ముందు వ‌ర‌కు ఆయ‌న బీజేడీ నాయ‌కుడిగా కొన‌సాగారు. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో క‌ట‌క్ నుంచి పోటీ చేసి విజ‌యం సాధించారు.

18వ లోక్‌స‌భ స‌మావేశాలు జూన్ 24 నుంచి ప్రారంభం కానున్నాయి. 24, 25 తేదీల్లో కొత్త స‌భ్యులు ప్ర‌మాణం చేయ‌నున్నారు. జూన్ 26న స్పీక‌ర్ ఎన్నిక జ‌ర‌గ‌నుంది.