Sanjay Dutt | రాజకీయ రంగ ప్రవేశంపై క్లారిటీ ఇచ్చిన సంజయ్‌ దత్‌

బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో హర్యానా మాజీ సీఎంపై పోటీ చేయబోతున్నట్లుగా ప్రచారం సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతున్నది

Sanjay Dutt | రాజకీయ రంగ ప్రవేశంపై క్లారిటీ ఇచ్చిన సంజయ్‌ దత్‌

Sanjay Dutt | బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో హర్యానా మాజీ సీఎంపై పోటీ చేయబోతున్నట్లుగా ప్రచారం సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతున్నది. ఈ క్రమంలో తన రాజకీయరంగ ప్రవేశంపై వస్తున్న వార్తలను సంజయ్‌ దత్‌ ఖండించారు. ఆ వార్తలన్నీ ఊహాగానాలేనని కొట్టిపడేశారు. తాను పార్టీలో చేరబోవడం లేదని.. రాజకీయాల్లోకి వస్తే తానే స్వయంగా ప్రకటిస్తానని వెల్లడించారు. ఈ మేరకు ఎక్స్‌ (ట్విట్టర్‌) పోస్ట్‌ ద్వారా వెల్లడించారు. ‘రాజకీయాల్లోకి వస్తున్నట్లుగా వస్తున్న అన్ని పుకార్లకు ముగింపు పలకాలనుకుంటున్నాను. నేను ఏ పార్టీలో చేరబోవడం లేదు. నేను రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకుంటే ఆ విషయాన్ని ముందుగానే ప్రకటిస్తారు. దయచేసి అప్పటి వరకు రాజకీయాల్లోకి వస్తున్నట్లుగా వార్తలను నమ్మొద్దు’ అని విజ్ఞప్తి చేశారు.

అయితే, గత కొద్దిరోజులుగా సంజయ్‌ దత్‌ కాంగ్రెస్‌ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో బరిలోకి దిగబోతున్నారని.. మాజీ సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌పై కర్నాల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీకి కాంగ్రెస్‌ హైకమాండ్‌ సైతం సంజయ్‌ దత్‌ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లుగా ప్రచారం జరిగింది. సంజయ్‌ దత్‌కు హర్యానాతో అనుబంధం ఉన్నది. సంజయ్‌దత్‌ పూర్వీకుల గ్రామం యమునానగర్ జిల్లాలో ఉంది. అయితే, సంజయ్‌ దత్‌ తండ్రి సునీల్‌ దత్‌ సైతం మన్మోహన్‌ సింగ్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. ఆయన సోదరి ప్రియా దత్‌ సైతం ఎంపీగా కొనసాగుతున్నారు.