Heart Stroke | ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. 50 మంది ప్రాణాలు కాపాడిన కండక్టర్.. వీడియో
Heart Stroke | బెంగళూరు : బస్సు నిండా ప్రయాణికులు.. వేగంగా దూసుకెళ్తోంది.. అంతలోనే డ్రైవర్( Driver )కు గుండెపోటు( Heart Stroke ).. క్షణాల్లోనే స్టీరింగ్‌ను వదిలేసి.. కుప్పకూలిపోయాడు. అప్రమత్తమైన కండక్టర్( Conductor ).. స్టీరింగ్‌ను తన చేతుల్లోకి తీసుకొని.. బస్సులోని ప్రయాణికులను కాపాడాడు. ఈ ఘటన కర్ణాటక( Karnataka ) రాష్ట్రంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ (BMTC) కు చెందిన బస్సు బుధవారం ఉదయం 11 గంటల సమయంలో నేలమంగళ( Nelamangala ) నుంచి దసన్‌పురా( Dasanapura ) ఏరియాకు బయల్దేరింది. 40 ఏండ్ల వయసున్న కిరణ్ కుమార్( Kiran Kumar ) బస్సును నడుపుతున్నాడు. అయితే బస్సు వేగంగా వెళ్తున్న సమయంలోనే మార్గమధ్యలో కిరణ్ కుమార్ గుండెపోటు( Heart Stroke )కు గురయ్యాడు. దీంతో స్టీరింగ్‌ను వదిలేసి పక్కకు ఒరిగాడు.
అప్రమత్తమైన కండక్టర్( Conductor ) ఓబలేష్.. క్షణాల్లోనే స్టీరింగ్‌ను తన చేతుల్లోకి తీసుకున్నాడు. బస్సును కంట్రోల్ చేసి సడెన్ బ్రేక్ వేసి బస్సును పక్కకు ఆపాడు కండక్టర్. అనంతరం ప్రయాణికులను అప్రమత్తం చేసి, సమీప హాస్పిటల్‌కు కిరణ్‌ను తరలించగా, అప్పటికే గుండెపోటుతో ప్రాణాలు విడిచినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
అయితే ఈ సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులను ప్రాణాలతో కాపాడిన కండక్టర్ ఓబలేష్‌ను బీఎంటీసీ యాజమాన్యం అభినందించింది. ఇక కిరణ్ కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి ప్రకటించింది. కిరణ్ కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ఇస్తామని తెలిపింది. ఇక డ్రైవర్ గుండెపోటుకు గురైన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. డ్రైవింగ్ సీటు పైకి దూకి అందరి ప్రాణాలు కాపాడిన కండక్టర్
బెంగుళూరులో నేలమంగళ నుండి దసనాపుర వెళ్తున్న ఆర్టీసీ బస్సులో గుండెపోటుతో డ్రైవింగ్ సీట్ మీదే ప్రాణాలు విడిచిన బస్సు డ్రైవర్ కిరణ్ కుమార్.
డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో డ్రైవింగ్ సీటు… pic.twitter.com/R53YNgpkrm
— Telugu Scribe (@TeluguScribe) November 6, 2024