- 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 5.18 కోట్ల ఓట్ల తొలగింపు
- 10.2 శాతం తొలగింపు తరువాత మొత్తం ఓటర్లు 45.81 కోట్లు
విధాత, హైదరాబాద్:
దేశవ్యాప్తంగా నిర్వహించిన రెండో విడత ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో 5.18 కోట్ల మంది ఓటర్ల పేర్లను కేంద్ర ఎన్నికల కమిషన్ తొలగించింది. 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఓటరు సవరణ కార్యక్రమం శుక్రవారంతో పూర్తయ్యింది. తొలగించిన వారిలో 66.88 లక్షల మంది ఓటర్ల వరకు చనిపోయిన వారే కావడం గమనార్హం. సవరణ తరువాత జాబితాలో 45.81 కోట్ల ఓటర్లు ఉన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 25.47 లక్షలు, పశ్చిమ బెంగాల్‌లో 24.16 లక్షల మంది చనిపోయిన ఓటర్ల పేర్లు జాబితా నుంచి తీసివేశారు. రెండో విడత ఎస్ఐఆర్ ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, కేరళ, పుదుచ్చేరి, గుజరాత్, గోవా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలతో పాటు అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్‌లో నిర్వహించారు.
మూడో విడతలో 40 కోట్ల మంది ఓటర్ల వడపోత
మూడో విడతలో భాగంగా 17 రాష్ట్రాలలో 40 కోట్ల ఓటర్ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం వడపోయనున్నది. ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, చండీగఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్ము కశ్మీర్, ఝార్ఖండ్, కర్నాటక, లద్దాఖ్ మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, ఢిల్లీ, ఒడిశా, పంజాబ్, సిక్కిం, త్రిపుర, తెలంగాణ, ఉత్తరాఖండ్ రాష్ట్రాలతో పాటు దాద్రా నగర్ హవేలి, డయ్యూ డామన్ కేంద్ర పాలిత ప్రాంతాలలో మూడో విడత సర్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సోం అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తరువాత ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు, జానాభా లెక్కల సేకరణ వంటి పనుల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ మూడో విడత ఎస్ఐఆర్ ను జూన్ కు వాయిదా వేసింది.
పాతికేళ్లకోసారి…
- ప్రతి 25 సంవత్సరాలకు ఒకసారి ఎస్ఐఆర్ ప్రక్రియను కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్నది. చివరగా 2001 లో ఎస్ఐఆర్ నిర్వహించారు.
- ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి 11 రకాల గుర్తింపు కార్డులను కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రతినిధులు ఓటర్ల నుంచి సేకరించనున్నారు.
- 1987 సంవత్సరానికి ముందు జన్మించిన వారికి తల్లిదండ్రుల వివరాలు, 1987 నుంచి 2004 మధ్య జన్మించిన వారికి బర్త్ సర్టిఫికెట్లు ప్రామాణికంగా తీసుకోనున్నారు.
- 2004 సంవత్సరం తరువాత పుట్టిన వారికి మిగతా వాటిని పరిగణనలోకి తీసుకుంటారు.
అవి…
- పాస్ పోర్టు,
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు కార్డులు,
- బర్త్ సర్టిఫికెట్,
- యూనివర్సిటీ సర్టిఫికెట్లు,
- జాతీయ గుర్తింపు కార్డులు,
- ఫారెస్టు హక్కుల పత్రాలు,
- కుటుంబ గుర్తింపు పత్రాలు,
- ప్రభుత్వ నివాస పట్టా పత్రాలు,
- పర్మినెంట్ రెసిడెంట్ సర్టిఫికెట్లు,
- కుల సర్టిఫికెట్లు,
- ఎల్ఐసీ బాండ్లు
ఇవి కూడా చదవండి..
తెలంగాణలోని సర్కారు బడి విద్యార్థులకు గుడ్ న్యూస్!
OPPO A6k | ఒప్పో నుంచి 7000mAh బ్యాటరీతో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్.. ధర, స్పెసిఫికేషన్ల వివరాలివీ!
Fridge Cooling Tips | సమ్మర్‌లో మీ ఫ్రిజ్ కూలింగ్ తగ్గిందా.. ఈ టిప్స్‌తో సమస్యను చిటికెలో సాల్వ్ చేయండి!Drumstick Farming | మునగకాయలతో భలే వ్యాపారం.. ఏడాదికి రూ. 30 లక్షలు సంపాదిస్తున్న వృద్ధ రైతు
