SIR | ఎస్ఐఆర్ ప్రక్రియపై సీఈసీ కీలక ప్రకటన..!

దొంగ ఓట్లను గుర్తించడంతో పాటు వాటిని సరిచేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ (స్పెషట్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియలో భాగంగా కొత్త ఓటర్లను చేర్చడం, ఓటర్ల జాబితాలో మార్పులు చేయడం వంటివి చేపడుతారు. అర్హత ఉన్న ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించడం ఎస్ఐఆర్ ముఖ్య ఉద్దేశం. బీహార్ లో నిర్వహించిన మాదిరిగానే మరో 12 రాష్ట్రాల్లో సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను సీఈసీ చేపట్టనుంది.

SIR | ఎస్ఐఆర్ ప్రక్రియపై సీఈసీ కీలక ప్రకటన..!

న్యూఢిల్లీ :
దొంగ ఓట్లను గుర్తించడంతో పాటు వాటిని సరిచేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ (స్పెషట్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియలో భాగంగా కొత్త ఓటర్లను చేర్చడం, ఓటర్ల జాబితాలో మార్పులు చేయడం వంటివి చేపడుతారు. అర్హత ఉన్న ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించడం ఎస్ఐఆర్ ముఖ్య ఉద్దేశం. బీహార్ లో నిర్వహించిన మాదిరిగానే మరో 12 రాష్ట్రాల్లో సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను సీఈసీ చేపట్టనుంది. ఈ మేరకు ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ సోమవారం ఎస్‌ఐ‌ఆర్ ప్రక్రియకు సంబంధించి మీడియాతో మాట్లాడారు.

మొదటి దశలో బీహార్ విజయవంతంగా ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయిందని.. ఇందుకు సంబంధించిన ప్రక్రియకు సహకరించిన 7.5 కోట్ల బీహార్ ప్రజలకు సీఈసీ ధన్యవాదలు తెలిపారు. మొదటి దశ అనంతరం రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల ఎన్నికల అధికారులతో ఈసీ సమావేశాలు నిర్వహించి, సమగ్రంగా చర్చించిందన్నారు. ఈ సందర్భంగా రెండో దశలో ఎస్ఐఆర్ నిర్వహించే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పేర్లను సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ వెల్లడించారు. ఉత్తర్‌ప్రదేశ్‌, బంగాల్‌, రాజస్థాన్‌, కేరళ, మధ్యప్రదేశ్‌, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌, గోవా, గుజరాత్‌, పుదుచ్చేరి, అండమాన్‌, లక్షద్వీప్‌లో ఎస్ఐఆర్ ను నిర్వహించనున్నట్లు సీఈసీ వివరించారు. డిసెంబరు 9న ముసాయిదా సమగ్ర ఓటర్ల జాబితా సవరణ జాబితాను విడుదల చేయనున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న తుది ఓటర్ల జాబితా ప్రకటిస్తామని వెల్లడించారు. దేశంలో ఇప్పటివరకు ఎస్ఐఆర్ 8సార్లు జరిగిందన్న ఆయన, గత 20 ఎళ్ల నుంచి ఇప్పటివరకూ ఒక్కసారి కూడా ఈ ప్రక్రియ జరగలేదని సీఈసీ గుర్తు చేశారు.