Maharashtra Elections | నవంబర్ 20న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు.. 23న కౌంటింగ్
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల9 Maharashtra Elections ) నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది.

Maharashtra Elections | న్యూఢిల్లీ : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల9 Maharashtra Elections ) నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. 288 అసెంబ్లీ నియోజకవర్గాలున్న మహారాష్ట్ర( Maharashtra )లో ఒకే విడుతలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు.
ఈ నెల 22న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 29 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ నవంబర్ 4. నవంబర్ 20న ఎన్నికలు నిర్వహించి.. 23న ఫలితాలను ప్రకటించనున్నారు.
మహారాష్ట్రంలో 36 జిల్లాల్లో మొత్తం 288 నియోజకవర్గాలు ఉన్నాయి. 234 జనరల్ సీట్లు కాగా, 25 ఎస్టీ, 29 ఎస్సీ స్థానాలు ఉన్నాయి. 2024 అక్టోబర్ 15 నాటికి మొత్తంగా 9.63 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 4.97 కోట్ల మంది పురుషులు, 4.66 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అలాగే 1.85 కోట్ల మంది 20-29 ఏండ్ల లోపు వారు కాగా, 20.93 లక్షల మంది తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అసెంబ్లీ ఎన్నికల కోసం 1,00,186 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ఈ ఏడాది నవంబర్ 26తో ముగియనుంది.