భారత్ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ పాకిస్తాన్ కు తీవ్ర హెచ్చరికలు చేశారు. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చి భారత్‌పై ప్రయోగించాలని చూస్తే పాకిస్థాన్ ప్రపంచ పటంలో ఉంటుందో లేక చరిత్రలో కలిసిపోతుందో ఆ దేశమే తేల్చుకోవాలని తీవ్రంగా హెచ్చరించారు. ఉగ్రవాదులను, వారి మద్దతుదారులను భారత్ ఒకేవిధంగా పరిగణిస్తుందని.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చర్యలు కొనసాగిస్తుందని స్పష్టంచేశారు. పాక్ భూభాగంలో ఇంకా ఉగ్రవాద శిబిరాలు కొనసాగుతున్నాయని, సరిహద్దు భద్రత విషయంలో ఎలాంటి రాజీ లేదని తెలిపారు.
పహల్గామ్‌లో పర్యాటకుల ఊచకోతకు ప్రతికారంగా పాకిస్థాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై చేపట్టిన ఆపరేషన్ సిందూర్ గురించి జనరల్ ద్వివేది ట్లాడుతూ.. ఆ సమయంలో పాకిస్థాన్‌లో ఉగ్రవాద స్థావరాల ఉనికి గురించి ప్రపంచానికి ఆధారాలు అందించామని పేర్కొన్నారు. పొరుగుదేశం తన తీరును మార్చుకోకుంటే ఆ ఆపరేషన్‌కు సంబంధించిన రెండో వెర్షన్ తీవ్రస్థాయిలో ఉంటుందని హెచ్చరించారు. ‘ఆపరేషన్ సింధూర్’ సమయంలో చూపినంత సంయమనం భవిష్యత్తులో ఉండకపోవచ్చని స్పష్టం చేశారు. పాకిస్తాన్ చిన్న తప్పు చేసినా, భారత్ సైన్యం అంతకంటే భారీ స్థాయిలో స్పందించడానికి సిద్ధంగా ఉందని, సరిహద్దుల్లో పూర్తి అప్రమత్తతతో ఉందని తెలిపారు. భారత ప్రభుత్వం ఎప్పుడూ దేశ ప్రజల పురోగతి, శ్రేయస్సుపైనే దృష్టి పెడుతుందని.. తన మార్గంలో ఎవరైనా అడ్డంకులు సృష్టిస్తే, దీటుగా స్పందిస్తుందని అని స్పష్టం చేశారు.
#BREAKING: Indian Army Chief General Upendra Dwivedi’s firm message to Terror State Pakistan.
“If Pakistan continues to harbour terrorists and operate against India, then they have to decide, whether they want to be part of geography and history or not”. pic.twitter.com/O0jFUf7fLX
— Aditya Raj Kaul (@AdityaRajKaul) May 16, 2026
ఇవి కూడా చదవండి :
బోరుబావిలో పడిపోయిన మనవడిని రక్షించబోయి తాత మృతి!
బండి సంజయ్ ని మంత్రి పదవి నుంచి తొలగించాలి: ప్రధానికి బాధితురాలి లేఖ
