Priyanka Gandhi | నాడు బ్రిటిషర్లపై మహాత్ముడి పోరాటం వంటిదే నేటి మోదీపై కాంగ్రెస్‌ పోరు : ప్రియాంకగాంధీ

ఆనాడు మహాత్మా గాంధీ బ్రిటిష్‌ సామ్రాజ్యవాదంపై చేసిన తరహాలో యుద్ధాన్ని నేడు కాంగ్రెస్‌ పార్టీ మోదీ సామ్రాజ్యంపై చేస్తున్నదని కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంక గాంధీ అన్నారు. ప్రధాన మంత్రి తన పదవికి తగినట్టు హుందాగా వ్యవహరించడం లేదని విమర్శించారు.

  • By: TAAZ |    national |    Published on : Nov 09, 2025 5:36 PM IST
Priyanka Gandhi | నాడు బ్రిటిషర్లపై మహాత్ముడి పోరాటం వంటిదే నేటి మోదీపై కాంగ్రెస్‌ పోరు : ప్రియాంకగాంధీ

Priyanka Gandhi | ఆనాడు మహాత్మా గాంధీ బ్రిటిష్‌ సామ్రాజ్యవాదంపై చేసిన తరహాలో యుద్ధాన్ని నేడు కాంగ్రెస్‌ పార్టీ మోదీ సామ్రాజ్యంపై చేస్తున్నదని కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంక గాంధీ అన్నారు. ప్రధాన మంత్రి తన పదవికి తగినట్టు హుందాగా వ్యవహరించడం లేదని విమర్శించారు. ఒకవైపు అహింసను బోధించే వందేమాతరం గీతాన్ని కీర్తిస్తున్న మోదీ.. మరోవైపు ‘నాటు’, ‘దోనలీ’ (డబుల్‌ బేరల్‌ గన్‌) అంటూ బహిరంగ సభల్లో వీధి భాష మాట్లాడుతున్నారని మండిపడ్డారు. శనివారం బీహార్‌లోని కతిహార్‌, భాగల్పూర్‌, పూర్ణియా జిల్లాల్లో నిర్వహించిన పలు ఎన్నికల బహిరంగ సభల్లో ఆమె మాట్లాడారు.

‘ఇండియా కూటమి, కాంగ్రెస్‌ పార్టీ ఈ రోజు చేస్తున్న పోరాటం.. గతంలో మహాత్మా గాంధీ నాటి బ్రిటిష్‌ సామ్రాజ్యవాదంపై చేసిన పోరాటం వంటిదే. ఈ రోజుకూ మన హక్కులు, వాస్తవం కోసం పోరాడాల్సి వస్తున్నది. ఒక సామ్రాజ్యంపై పోరాటం చేస్తున్నాం.. అది మోదీ సామ్రాజ్యం. మోదీ ఒక తన ప్రభుత్వాన్ని ఇదే తరహాలో నడిపిస్తున్నారు. ఆయన ప్రజలను అణగదొక్కుతున్నారు. ప్రజలను విభజిస్తున్నారు. మహాత్మా గాంధీ ఒక నాడు ఏ హక్కులు సాధించేందుకు పోరాటం చేశారో.. ఆ హక్కులు ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయి. అన్నింటికంటే ముఖ్యమైనది ఓటు వేసే హక్కు.. అది కూడా ప్రమాదంలో ఉంది’ అని ప్రియాంక చెప్పారు. స

‘ఒకవైపు అహింసను బోధించే వందేమాతరం గీతాన్ని ప్రధాని కీర్తిస్తారు. మరోవైపు బహిరంగ సభల్లో కట్టా (నాటు), దోనలీ (డబుల్‌ బ్యారెల్‌ గన్‌) వంటి పదాలు వాడుతున్నారు’ అని ప్రియాంక మండిపడ్డారు. బీజేపీ జాతీయవాదం పూర్తి ఫేక్‌ అని విమర్శించారు. ఎన్నికలప్పుడు మాత్రమే బీజేపీకి జాతీయ వాదం గుర్తుకు వస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ స్కీమ్‌.. జాతీయవాద దృక్ఫథంతో ఆర్మీ సెలక్షన్స్‌కు సిద్ధమైన బీహార్‌ యువతను నిరుత్సాహపర్చిందన్నారు.

Read Also |

Jubilee Hills By-election| జూబ్లీహిల్స్..బీహార్ లలో ముగిసిన ఎన్నికల ప్రచారం
Anupama Parameswaran| అనుపమ పరమేశ్వరన్ కు యువతి సైబర్ వేధింపులు
IRCTC Best Package: రూ. 11990కే 5 రాత్రులు, 6రోజులు అదిరిపోయే యాత్ర