Womens Rozgar Scheme Bihar | ప్రపంచ బ్యాంకు అప్పుతో బీహార్ మహిళలకు రూ.10 కోట్ల హారతి!

అభివృద్ధి పనుల కోసం ప్రపంచ బ్యాంకు అందించిన నిధులను బీహార్‌లో ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్‌ యోజన కోసం వినియోగించారన్న వాదనలు సంచలనం రేపుతున్నాయి.

  • By: TAAZ |    national |    Published on : Nov 16, 2025 8:52 PM IST
Womens Rozgar Scheme Bihar | ప్రపంచ బ్యాంకు అప్పుతో బీహార్ మహిళలకు రూ.10 కోట్ల హారతి!

హైదరాబాద్, విధాత ప్రతినిధి:

Womens Rozgar Scheme Bihar | బీహార్‌లో అభివృద్ధి పనుల కోసం ప్రపంచ బ్యాంకు రూ.14వేల కోట్లు మంజూరు చేసింది. ఆ నిధులు అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు విడుదల కావడం ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ పంట పండించింది. ఈ డబ్బును మౌలిక సదుపాయాల కోసం ఉపయోగించకుండా ముఖ్యమంత్రి మహిళా రోజ్ గార్ యోజనకు మళ్లించి మరోసారి నితీశ్‌ అధికారాన్ని దక్కించుకున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ మొదటి వారంలో మహిళలు వాళ్ల స్వశక్తితో నిలబడేలా, ఇంటి వద్దే ఉపాధి పొందేలా ఈ పథకం ప్రారంభిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. మొత్తం ఒక కోటీ ఇరవై లక్షల మంది మహిళలు దరఖాస్తు సమర్పించగా రెండు విడతల్లో ఒక కోటి మంది నగదు బదిలీ చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత మిగతా వారికి నగదు బదిలీ చేయనున్నారు.

Nitish Kumar| బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు

ఈ ఏడాది సెప్టెంబర్ 7వ తేదీన ముఖ్యమంత్రి మహిళా రోజ్ గార్ యోజన పథకం కోసం ఆన్ లైన్ లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. ఇందు కోసం ప్రత్యేక వెబ్ పోర్టల్ అందుబాటులోకి తెచ్చారు. రాష్ట్రంలో 75 లక్షల మంది మహిళలకు సాయం చేయలని లక్ష్యంగా నిర్ణయించారు. ఆదాయపు పన్ను చెల్లించేవారు, ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లోని మహిళలు అనర్హులు అని ప్రకటించారు. 18 నుంచి 60 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న మహిళలను అర్హులుగా నిర్ణయించారు. సెప్టెంబర్ 26వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పథకాన్ని ప్రారంభించారు. తొలి విడత కింద మొత్తం 75 లక్షల మంది మహిళలకు రూ.10వేల చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో ట్రాన్స్ ఫర్ చేశారు. రెండో విడత కింద అక్టోబర్ 3వ తేదీన 25 లక్షల మంది మహిళలకు నగదు బదిలీ చేశారు. ప్రభుత్వం అందచేసిన సాయంతో ఏ వ్యాపారం ప్రారంభించారనేది చూసి, ఆరు నెలల తరువాత రూ.2 లక్షల వరకు రుణ సాయం చేస్తామని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రకటించారు. రాష్ట్రంలోని మొత్తం 2.7 కోట్ల కుటుంబాల్లోని మహిళలకు సాయం చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పటి వరకు ఒక కోటి మహిళలకు రూ.10వేల చొప్పున రూ.10వేల కోట్లు నగదు బదిలీ చేశారు.

Lalu Prasad Yadav| ఓటమి వేళ…అంతర్గత కలహాలలో లాలూ కుటుంబం

ఈ పథకమే మహా ఘట్ బంధన్ కూటమిని ఘోరంగా ఓటమి పాలు చేసిందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. మహిళల బ్యాంకు ఖాతాల్లో నేరుగా డబ్బులు వేయడంతో వారి సంతోషానికి అవధులు లేకుండా పోయింది. రాష్ట్ర జనాభాలో మహిళా ఓటర్లు 48 శాతం వరకు ఉన్నారు. లబ్ధి పొందిన వారిలో హిందూవులతో పాటు ముస్లిం, క్రిష్టియన్ మహిళలు కూడా ఉన్నారు. వీరంతా గంపగుత్తగా ఓటు వేయడం మూలంగా ఎన్డీఏ 200 కు పైగా సీట్లను సునాయసంగా గెలుపొందిందని చెబుతున్నారు. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ వంటి ఆర్థిక సంస్థలు ఇచ్చే రుణాలు అభివృద్ధి పనులకు వెచ్చించాల్సి ఉంటుంది. సంక్షేమం, జనాకర్షక పథకాలకు రుణాలు మంజూరు చేయరు. సర్కార్ ఖజానాలో ప్రపంచ బ్యాంకు నిధులు జమ అయిన తరువాత ముఖ్యమంత్రి నితీష్ ఏమాత్రం ఆలోచించకుండా ఆ నిధులను ముఖ్యమంత్రి మహిళా రోజ్ గార్ యోజనకు బదలాయించారంటున్నారు.

Read Also |

India Draft Seeds Bill 2025 Analysis | ముసాయిదా విత్తన బిల్లు–2025లో ఏముంది? రైతులకు నష్టాలేంటి?
Demonetisation | పెద్ద నోట్ల రద్దుకు తొమ్మిదేళ్లు పూర్తి.. అనుకున్న లక్ష్యాల్లో సాధించిందెంత?
Asian Water Snake |  అసోం ‘జూ’లో అరుదైన పాము దర్శనం
Shooter Dhanush Srikanth| తెలంగాణ షూటర్ ధనుష్ శ్రీకాంత్ కు కోటి 20లక్షల భారీ నజరానా