Demonetisation | పెద్ద నోట్ల రద్దుకు తొమ్మిదేళ్లు పూర్తి.. అనుకున్న లక్ష్యాల్లో సాధించిందెంత?

 పెద్ద నోట్ల రద్దు! ఈ విషయాన్ని తల్చుకుంటే ఆనాటి కష్టాలన్నీ ఒకసారిగా కళ్ల ముందు రీల్స్‌ తిరిగినట్టు తిరుగుతాయి. తమ వద్ద ఉన్న రూ.500, రూ.1000 నోట్లను బ్యాంకుల్లో జమ చేసి, అంతే మొత్తానికి చెల్లుబాటులో ఉన్న కరెన్సీని, అప్పటికప్పుడు కొత్తగా ప్రవేశపెట్టిన రూ.2000 నోట్లను తీసుకోవడం, బ్యాంకుల్లో ఉన్న నగదు విత్‌డ్రా చేసుకోవడానికి ఏటీఎంల ముందు క్యూ లైన్లు! పెద్ద నోట్లకు చిల్లర దొరకక కష్టాలు! ప్రత్యేకించి అసంఘటిత రంగ కార్మికులు అనుభవించిన బాధలు అన్నీ ఇన్నీ కావు.

  • By: TAAZ |    national |    Published on : Nov 16, 2025 5:00 PM IST
Demonetisation | పెద్ద నోట్ల రద్దుకు తొమ్మిదేళ్లు పూర్తి.. అనుకున్న లక్ష్యాల్లో సాధించిందెంత?

Demonetisation | సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం అంటే నవంబర్‌ 8, 2016న ‘సోదర సోదీమణులారా..’ అంటూ ప్రారంభించిన మోదీ ఆకస్మిక టీవీ ప్రసంగం.. సంచలనానికి దారి తీసింది. తెల్లారితే 500 రూపాయల నోట్లు, వెయ్యి రూపాయల నోట్లు చెల్లబోవని ఆయన ప్రకటించారు. దేశంలో నల్లధనాన్ని అరికట్టడానికి, అవినీతిని నిర్మూలించడానికి, నకిలీ కరెన్సీని ఏరివేయడానికి, ఉగ్రవాద శక్తుల పీచమణచడానికి పెద్ద నోట్లను రద్దు చేసినట్టు బీజేపీ నాయకత్వం ఘనంగా చెప్పుకొన్నది. తమ చర్య సమాజంలో అవినీతిని నిర్మూలించే నగదు రహిత ఆర్థిక వ్యవస్థ దిశగా, భారదేశాన్ని డిజిటల్‌ దిశగా నడిపించేందుకు ఈ చర్య దోహదం చేస్తుందని ప్రకటనలు గుప్పించారు. ఇది గొప్ప చర్య అంటూ బీజేపీని సమర్థించే మేధావిలోకం ప్రశంసలు గుప్పించింది. కానీ.. ఆ నిర్ణయం.. దేశాన్ని అల్లకల్లోలం చేసింది. ఏ ఏటీఎం ముందు చూసినా, ఏ బ్యాంకు ముందు చూసినా భారీ క్యూ లైన్లు.. అందులో గంటల తరబడి ఎదురు చూస్తున్న సాధారణ, మధ్యతరగతి ప్రజలు!

Shooter Dhanush Srikanth| తెలంగాణ షూటర్ ధనుష్ శ్రీకాంత్ కు కోటి 20లక్షల భారీ నజరానా

దేశంలో నాలుగు లక్షల కోట్ల రూపాయల నల్లధనం ఉన్నదని, ఈ దెబ్బతో ఆ నల్లధనం మొత్తం చెల్లకుండా పోతుందని ప్రభుత్వం చెబుతూ వచ్చింది. కానీ.. ఈ మొత్తం ప్రక్రియ పూర్తయ్యే నాటికి ఆర్బీఐ విడుదల చేసిన గణాంకాలు భిన్నమైన దృశ్యాన్ని చూపాయి. నోట్ల రద్దు కారణంగా చెల్లకుండా పోయిన రూ.15.41 లక్షల కోట్లలో ఆర్బీఐకి తిరిగి వచ్చిన మొత్తం రూ.15.31 లక్షల కోట్లు అని ప్రకటించింది. మరి మోదీ, ఆయన ప్రభుత్వంలోని మంత్రులు చెప్పిన నాలుగు లక్షల కోట్ల నల్లధనం ఏమైందో వారికే తెలియాలి. నిజానికి ఈ రోజుల్లో గతంలో మాదిరి బ్లాక్‌ మనీని బీరువాల్లో కట్టలు కట్టలు దాచుకోవడం లేదని, ఎప్పటికప్పుడు భూములుగానో, భవంతులుగానో అది రూపం మార్చుకుంటూ వచ్చిందని నిపుణులు చెబుతున్నారు.

Justice BR Gavai| రాజ్యాంగ హక్కులపై అందరికి అవగాహన ఉండాలి : జస్టిస్ బీఆర్.గవాయ్

నోట్ల రద్దు మరో ఉద్దేశం నకిలీ కరెన్సీని అరికట్టడం. అదే సమయంలో ఉగ్రవాదులకు నిధుల సరఫరాను అడ్డుకోవడం. కానీ.. ఆర్థిక వ్యవహారాల శాఖ విడుదల చేసిన గణాంకాలు గమనిస్తే.. ఈ రెండు లక్ష్యాలూ విఫలమయ్యాయని అర్థమవుతున్నది. 500 రూపాయల నకిలీ నోట్లు గణనీయంగా పెరిగాయని తేలింది. 2022–23లో 91,110 నకిలీ 500 కరెన్సీ నోట్లు పట్టుబడగా.. 2023–24 నాటికి ఆ సంఖ్య 85,711గా ఉన్నది. ఇక 2024–25లో అది ఏకంగా 1,17,722కు పెరిగింది. మరి నకిలీ కరెన్సీకి అడ్డు కట్ట అనే లక్ష్యం ఏమైనట్టు అనే ప్రశ్నకు సమాధానం లేదు. 2016లో ఆకస్మికంగా ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు నిర్ణయం నేపథ్యంలో ప్రభుత్వం అప్పటికే కొత్త 2000 నోటును చలామణీలోకి తీసుకువచ్చింది. అప్పటి నగదు లభ్యత కోసమే రెండు వేల రూపాయల నోట్లను తీసుకు వచ్చామని చెప్పిన ప్రభుత్వం.. ఏడేళ్ల తర్వాత.. అంటే 2023 మార్చిలో దీనిని కూడా చలామణీ నుంచి ఉపసంహరించింది. రొటీన్‌గా నిర్వహించే కరెన్సీ మేనేజ్‌మెంట్‌ చర్యగా ఆర్థిక శాఖ దీనిని అభివర్ణించినప్పటికీ.. విధానపరమైన తప్పులను పరోక్షంగా అంగీకరించడం, నోట్ల రద్దు కారణంగా నెలకొన్న అనిశ్చితిని కొనసాగించడమేనన్న అభిప్రాయాల వ్యక్తమయ్యాయి.

India vs South Africa| దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో భారత్ అనూహ్య ఓటమి!

భారతదేశంలో అప్పటికి ప్రధానంగా నగదు లావాదేవీలే ఎక్కువగా నడిచేవి. ఆ సమయంలో ఆకస్మికంగా పెద్ద నోట్లను రద్దు చేయడం దేశ అనధికార ఆర్థిక వ్యవస్థకు గొడ్డలిపెట్టుగా మారిందనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ చర్యతో పెద్ద సంఖ్యలో నిరుద్యోగులుగా మారారు. చిన్న చిన్న కంపెనీలు, పరిశ్రమలు గణనీయమైన ప్రభావాన్ని ఎదుర్కొన్నాయి. అనేక కంపెనీలు మూతపడ్డాయి. 2016 తర్వాత డిజిటల్‌ పేమెంట్లు గణనీయంగా పెరిగినప్పటికీ.. ఇది పెద్ద నోట్ల రద్దు కారణంగా చోటు చేసుకున్న వ్యవస్థాగత మార్పు కాదని, ఫిన్‌టెక్‌ కంపెనీలు వేగంగా పెరగడం, కరోనా కాలపు మార్పులే డిజిటల్‌ పేమెంట్లు పెరగడానికి కారణమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. భారతదేశంలోని నిరక్షరాస్యత కూడా డిజిటల్‌ పేమెంట్లు పెరగడానికి ఒక ప్రధాన కారణంగా చెబుతున్నారు. గతంలో వస్తువు కొన్న తర్వాత చెల్లించిన నగదుకు చిల్లర ఇవ్వాల్సి వచ్చేది. నిరుపేద, నిరక్షరాస్య వీధి వ్యాపారుల వంటివారు కొంత ఇబ్బందికి గురయ్యేవారు. ఇప్పుడు ఎంత అంటే అంతే నేరుగా యూపీఐ పేమెంట్లతో అందుతున్నది. ఇది సులభంగా ఉండటం దీనికి పెరుగుదలకు కారణమని అంటున్నారు.

పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి తొమ్మిదేళ్లు నిండినా.. దానిపై చర్చ మాత్రం కొనసాగుతూనే ఉన్నది. ఎందుకంటే.. ఆ నాడు మోదీ ప్రకటించిన నల్లధనం నిర్మూలన, నకిలీనోట్ల ఏరివేత, ఉగ్రవాదులకు నిధులు స్తంభింపజేయడం, నగదు రహిత ఆర్థిక వ్యవస్థ తదితర హామీల అమలు కోసం ప్రజలు ఇంకా ఎదురుచూస్తేనే ఉన్నారు కనుక!

Read Also |

Asian Water Snake |  అసోం ‘జూ’లో అరుదైన పాము దర్శనం
Vijay TVK| “సర్” పై టీవీకే అధ్యక్షుడు విజయ్ ఆందోళన !
Cold Wave | న‌వంబ‌ర్ 28 త‌ర్వాత మ‌ళ్లీ వ‌ర్షాలు..! అప్ప‌టి వ‌ర‌కు చ‌లికి వ‌ణ‌కాల్సిందే..!
Danam Kadiyam Strategy | ఎన్నిక వైపా? కాలయాపనా! దానం, కడియం దారెటు?