India vs South Africa| దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో భారత్ అనూహ్య ఓటమి!

కోల్ కతా వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత్ అనూహ్య ఓటమి పాలైంది. 124 పరుగుల స్వల్ప విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్‌ఇండియా 35ఓవర్లలో 93పరుగులకు అలౌటై సొంతగడ్డపై దారుణ ఓటమి పాలైంది.

India vs South Africa| దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో భారత్ అనూహ్య ఓటమి!

విధాత : కోల్ కతా వేదికగా దక్షిణాఫ్రికా(South Africa)తో జరిగిన తొలి టెస్టు(First Test)లో భారత్(India) అనూహ్య ఓటమి(shocking defeat) పాలైంది. 124 పరుగుల స్వల్ప విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్‌ఇండియా 35ఓవర్లలో 93పరుగులకు అలౌటై  30 పరుగుల తేడాతో సొంతగడ్డపై దారుణ ఓటమి పాలైంది. లక్ష్య చేధనలోభారత్ రెండో ఇన్నింగ్స్ లో వరుస వికెట్లు కోల్పోగా.. వాషింగ్టన్ సుందర్ చేసిన 31పరుగులే అత్యధికం కావడం విశేషం. సఫారీ బౌలర్లలో సైమన్ హర్మన్ 4వికెట్లు, యన్సెన్, కేశవ్ మహారాజ్ చెరో 2వికెట్లు, మార్ క్రమ్ 1వికెట్ పడగొట్టి భారత్ పతనాన్ని సాధించారు.

మూడో రోజు ఆటలో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా కెప్టెన్ బవుమా (55*), కోర్బిన్‌ 25 పరుగుల సహకారంతో 153పరుగులకే అలౌటైంది చేశారు. భారత బౌలర్లలో జడేజా 4, కుల్‌దీప్‌ 2, సిరాజ్‌ 2 వికెట్లు పడగొట్టారు. అక్షర్‌ పటేల్‌, బుమ్రా చెరో వికెట్‌ తీశారు. 124పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోది కిగిన భారత్ రెండో ఇన్నింగ్స్ లో యశస్వీ జైస్వాల్ (0), కేఎల్ రాహుల్ (1), ద్రువ్ జురెల్ (13), రిషబ్ పంత్(2), రవీంద్ర జడేజా(18), అక్షర పటేల్(26), కుల్దీప్ యాదవ్(1), సిరాజ్(0) పరుగులకు అవుటయ్యారు.

బూమ్రా (0 నాటౌట్) నిలువగా.. గాయపడిన శుభమన్ గిల్(రిటైర్ట్ హార్డ్) బ్యాటింగ్ కు రాలేదు. సౌతాఫ్రికా 15 ఏళ్ల తర్వాత భారత్‌లో టెస్టు మ్యాచ్ గెలవడం విశేషం. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి ఎనిమిది వికెట్లు పడగొట్టిన సౌతాఫ్రికా స్పిన్నర్ హర్మర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 159, భారత్‌ 189 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ లో బూమ్రా 5వికెట్లతో రాణించాడు.