Danam Kadiyam Strategy | ఎన్నిక వైపా? కాలయాపనా! దానం, కడియం దారెటు?
పార్టీ ఫిరాయించిన విషయంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ నోటీసులకు సమాధానాలు ఇవ్వలేదు.. విచారణకు హాజరుకాలేదు.. ఇంతకీ కడియం శ్రీహరి, దానం నాగేందర్ వ్యూహం ఏంటి?
విధాత, ప్రత్యేక ప్రతినిధి:
Danam Kadiyam Strategy | బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలలో దానం నాగేందర్, కడియం శ్రీహరి తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దశలవారీగా పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీలోకి ఫిరాయించిన విషయం తెలిసిందే. ఈ పది మంది ఎమ్మెల్యేలలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా ఉన్నారు. ఈ పది మంది ఎమ్మెల్యేలపై సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ చేపట్టారు. పది మంది ఎమ్మెల్యేలలో ఇప్పటి వరకు ఎనిమిది మంది ఎమ్మెల్యేలను రెండు దశల్లో విచారించారు. మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి విచారణకు హాజరుకాలేదు. స్పీకర్ నోటీసులకు ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు జవాబు ఇవ్వలేదు. తాము సమాధానం ఇచ్చేందుకు సమయం కావాలని కోరినట్లు, ఈ మేరకు స్పీకర్ సానుకూలంగా స్పందించారని, సమయాన్ని బట్టి తమ స్పందన ఉంటుందని చెబుతూ వస్తున్నారు. ప్రస్తుతం ఎనిమిది ఎమ్మెల్యేలపై విచారణ శనివారానికి ముగిసింది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ఇంకా స్పందించక పోవడంలో ‘మర్మమేమిటనే’ చర్చ ప్రారంభమైంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు వెలువడి బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న సందర్భం, రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితుల్లో ఈ ఇద్దరు ఎమ్మెల్యేల దారెటు అనే చర్చ సాగుతోంది.
PM Kisan 21st Installment Release Date : రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు
నిర్ణయంపై ఉత్కంఠ
శనివారం స్పీకర్ గడ్డం ప్రసాద్ తన చాంబర్‌లో భద్రాచలం, జగిత్యాల ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, సంజయ్ కుమార్ పిటిషన్‌లపై విచారించారు. తొలి విడతలో నలుగురు ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్‌లను విచారించారు. రెండో విడతలో నలుగురు ఎమ్మెల్యేలు సంజయ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, అరికెపూడి గాంధీలను విచారించారు. అయితే అనర్హత అభియోగాలు ఎదుర్కొంటున్న మరో ఇద్దరు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి మాత్రం స్పీకర్ నోటిసులకు సమాధానం ఇవ్వలేదు. దీంతో ఈ ఇద్దరి అనర్హత అంశంపై విచారణ జరుగలేదు. నోటీసులకు స్పందించని ఇద్దరి ఎమ్మెల్యేల నిర్ణయం ఏ విధంగా ఉంటుందనే ఉత్సుకత రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది. మరో వైపు సోమవారం సుప్రీంకోర్టులో అనర్హత పిటిషన్ పై విచారణ ఉన్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఎన్నికల వైపా? కాలాయాపన?
CM Relief Fund issues | సీఎంఆర్ఎఫ్‌కు సీలింగ్!.. వైద్యం ఖర్చు ఎంతైనా ఇచ్చేది అంతేనట!
దానం నాగేందర్, కడియం శ్రీహరి ఈ ఫిరాయింపుల వ్యవహారంపై స్పష్టమైన అవగాహనతో అడుగులువేస్తున్నట్లు భావిస్తున్నారు. ముందు జాగ్రత్తతో పాటు ముందస్తు వ్యూహంతో ఉన్నట్లు చర్చసాగుతోంది. బీఆర్ఎస్ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధిగా బరిలో నిలిచి ఓటమిపాలయ్యారు. దీంతో ఆయన కాంగ్రెస్ ముద్ర నుంచి తప్పించుకునేందుకు అవకాశం తక్కువనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీ ఎంపీగా తన కుమార్తె కడియం కావ్య బరిలో నిలిచినప్పుడు పూర్తి బాధ్యతలు తీసుకున్నారు. కాంగ్రెస్ సమావేశాలు, సభల్లో పాల్గొన్నారు. ఇప్పటికీ ఆయన కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల్లో మీటింగులు నిర్వహిస్తున్నారు. దీంతో ఆయనకు కూడా కాంగ్రెస్ ముద్ర నుంచి తప్పించుకునేందుకు అవకాశం లేదనే వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ‘సాగదీత’ దోరణితో కలిసివచ్చినంత కాలం కానిచ్చి ఆ తర్వాత పరిస్థితి విషమించి, కోర్టుల నిర్ణయం, స్పీకర్ వేటు పడే అవకాశం ఉంటే ‘ముందస్తు’ రాజీనామాకు సైతం మానసికంగా సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇది కాకుండా కాలం కలిసొచ్చి ప్రస్తుత పది మందికి తోడు ‘శాసనసభా పక్ష విలీనానికి’ అవసరమైన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయిస్తే ఎవరూ రాజీనామా చేయాల్సిన అవసరం ఉండదనే మరో ప్లాన్‌తో ఉన్నట్లు చెబుతున్నారు. తాజాగా జూబ్లీ హిల్స్ ఎన్నికల విజయం నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి మరి కొంత మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారనే ప్రచారం అప్పుడే మొదలైంది. ఇది నిజమైతే ఎన్నికలు రాకుండానే పార్టీ మారేందుకు రాజమార్గం ఏర్పడుతోందంటున్నారు. ఉప ఎన్నికల వ్యూహంతోనే తమ నియోజకవర్గాల్లో అభివృద్ధికి నిధులు తెచ్చి పనులు చేస్తున్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా కడియం లాంటి వారు తమ నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఉప ఎన్నిక అనివార్యమైతే ఈ అభివృద్ధియే తమ విజయానికి దోహదం చేస్తుందనే భరోసాతో ఉన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ కూడా కడియం లాంటి వారికి నిధులు భారీగా కేటాయిస్తున్నారు. తాజా జూబ్లీ ఎన్నికల గెలుపు వీరిలో మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచినట్లు చెబుతున్నారు. రాజీనామా తప్పనిసరైతే రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక వచ్చే అవకాశం లేకపోలేదంటున్నారు. రాజకీయాల్లో తలపండిన నాయకులు కావడంతో ఆచితూచి అడుగులేస్తున్నారు.
Read Also |
Speaker Gaddam Prasad : ముగిసిన 8మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ
Bihar Elections 2025| నితీశ్, మోదీ మ్యాజిక్ కాదు.. మానిప్యులేషన్! అంతా ఆ పథకమే చేసింది!!
KTR Meets KCR : కేసీఆర్ ఫామ్ హౌస్ కు కేటీఆర్..జూబ్లీహిల్స్ ఫలితంపై చర్చ!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram