Bihar Elections 2025| నితీశ్, మోదీ మ్యాజిక్ కాదు.. మానిప్యులేషన్! అంతా ఆ పథకమే చేసింది!!
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ చరిష్మాలు, నితీశ్‌కుమార్ పాలన గొప్పతం అక్కడ ఎన్డీయే విజయానికి కారణాలు కావని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సుమారు 75 లక్షల మంది మహిళల ఖాతాల్లో ఎన్నికలకు ముందు పదివేల రూపాయలను ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన పథకం కింద అధికారికంగా జమ చేయడమే కారణమని తేల్చి చెబుతున్నారు.
Bihar Elections 2025| ఉచిత పథకాలు, సంక్షేమ పథకాలను ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ‘పల్లీ బఠాణీ’లంటూ ఎద్దేవా చేస్తూ ఉంటారు. మోదీ బొమ్మ ఉంటే చాలు ఎవరైనా గెలుస్తారని చెప్పే బీజేపీ నాయకులకు సైతం అదే పల్లీ బఠాణీలు అక్కరకు వచ్చాయి. బీహార్ ఎన్నికలను గమనిస్తే వ్యూహాలు, ఎత్తుగడలు, ఎత్తుకు పై ఎత్తులు వంటివి ఎన్నికల ప్రచారంలో ఎన్డీయేకు ఏం లాభం తెచ్చిపెట్టాయోగానీ.. అంతకు ముందే ఒక పథకం ఎన్డీయే విజయాన్ని లాక్ చేసేసింది. అదే ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన. మహిళలకు ఆర్థిక సహకారం అందించడం ద్వారా మహిళా సాధికారతను ప్రోత్సహించేందుకు ఈ పథకాన్ని తీసుకువచ్చారు.
Chirag Paswan | పడిలేచిన కడలితరంగం – చిరాగ్ పాశ్వాన్ : బీహార్ రాజకీయాల్లో నవతరం
బీహార్ లాంటి అత్యంత పేద రాష్ట్రంలో ఈ పథకం సరైనది, అందుకు అక్కడి మహిళలు అర్హులే అయినప్పటికీ.. ఈ పథకం ప్రారంభించిన టైమ్ చుట్టూనే వివాదం నడిచింది. ఈ పథకం కింద ఎంపిక చేసిన మహిళలకు తొలుత పదివేల రూపాయలు అందిస్తారు. తమ ఆధార్ వివరాల ఆధారంగా లబ్ధిదారులు పేమెంట్ స్టేటస్‌ను ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చు. పేద మహిళలు చిన్న చిన్న ఉపాధి అవకాశాలను కల్పించుకునేందుకు దీనిని ఉద్దేశించారు. ఈ పథకాన్ని 2025 సెప్టెంబర్ 26వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా ప్రారంభించారు. అంటే.. బీహార్ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు సుమారు వారం పది రోజుల ముందు ఈ పథకాన్ని గ్రౌండ్ చేశారు. అత్యంత పేదరికంలో మగ్గుతున్న బీహారీలకు ఈ పథకం గొప్ప రిలీఫ్‌ను ఇచ్చిందనడంలో సందేహం లేదు. ఆ సానుకూలతే ప్రచారాలు, ఎత్తుగడలు, అభ్యర్థుల గుణగణాలు అన్నింటినీ తోసిరాజని ఎన్డీయేను గెలిపించిందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ పథకం ప్రకారం.. ప్రతి కుటుంబంలోని ఒక మహిళ పేరిట పది వేల రూపాయలు నేరుగా వారి బ్యాంకు ఖాతాలోకి నగదు బదిలీ చేస్తారు. సదరు మహిళ ఎంచుకున్న పనిలో సంతృప్తికర ప్రగతిని ఆరు నెలల్లో కనబరిస్తే.. ఇదే పథకం కింద అదనంగా రెండు లక్షల రూపాయలు పొందుతారు. ఈ పథకం ఏడున్న కోట్ల మంది లబ్ధిదారులకు అందుతుందని పథకం ప్రారంభంలో అంచనా వేశారు. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా ఈ పథకాన్ని అమలు చేశారు. పట్టణ ప్రాంతాల్లో అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌ను భాగస్వామ్యం చేశారు. పథకం లబ్ధిదారులు ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో తమ పేరు నమోదు చేసుకునే వీలు కల్పించారు.
iBOMMA Ravi| ఐబొమ్మ నిర్వాహకుడు రవి అరెస్టు..విచారణ
ఆధార్, బ్యాంక్ పాస్‌బుక్, నివాస ధృవీకరణ పత్రం, వయస్సు ధృవీకరణ పత్రం, ఆదాయం ధృవీకరణ పత్రం, ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, అవసరమైతే ఏదన్నా విద్యార్హతకు సంబంధించిన పత్రాలు జత చేస్తే చాలు. తాము ఈ సొమ్ముతో ఏం చేయదల్చుకున్నదీ ఆ అప్లికేషన్‌లో వివరించవచ్చు. దరఖాస్తు చేసుకున్న ఏడు నుంచి 15 రోజులలో పదివేల రూపాయలు వారి ఖాతాల్లో పడిపోతాయి. సెప్టెంబర్‌లో ప్రారంభించిన ఈ పథకానికి ఇప్పటికే 75 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరందరికీ తొలి విడత పేమెంట్ అందింది. అంటే.. ఎన్నికల ముందు వివిధ పార్టీలు పంచే వెయ్యీ రెండు వేల రూపాయలు దీని ముందు ఎందుకూ కొరగాకుండా పోయాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నది. ప్రత్యేకించి ఎన్నికల ముందు ఈ పథకాన్ని గ్రౌండ్ చేయడం ద్వారా బీహార్ ఫలితాలను ఎన్డీయే ప్రభుత్వం ‘కొనుగోలు’ చేసిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పథకం కింద మొత్తం కోటిన్నర దరఖాస్తులను ప్రభుత్వం ఆమోదించింది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి మొత్తం లబ్ధిదారుల ఖాతాల్లోకి సొమ్మును డిపాజిట్ చేయనున్నది.
Read Also |
KTR Meets KCR : కేసీఆర్ ఫామ్ హౌస్ కు కేటీఆర్..జూబ్లీహిల్స్ ఫలితంపై చర్చ!
Revanth Reddy : రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
Kavitha| కృష్ణార్జునులమంటూ సొంత డబ్బా : కేటీఆర్, హరీష్ రావులపై కవిత విసుర్లు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram