Chirag Paswan | పడిలేచిన కడలితరంగం – చిరాగ్ పాశ్వాన్ : బీహార్ రాజకీయాల్లో నవతరం
బీహార్ 2025లో చిరాగ్ పాశ్వాన్ అద్భుత ఎదుగుదల. 2020 పరాభవం నుంచి ఎన్డీఏలో కీలక శక్తిగా ఎదిగిన యువ నాయకుడికథనం – ఒక స్ఫూర్తివంతమైన విజయగాథ
Rise of Chirag Paswan: The Young Gun Who Redefined NDA Politics in Bihar
- 2020లో పరాభవం… 2025లో రికార్డు గెలుపు
- చిరాగ్ పాశ్వాన్ చారిత్రక రాజకీయ పునరుత్థానం
- NDAలో కీలక శక్తిగా ఎదుగుదల
- తండ్రి వారసత్వం నుండి స్వీయ రాజకీయ గుర్తింపువరకు
(విధాత నేషనల్ డెస్క్)
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 2025—ఈసారి బిజేపీ కూటమి ఎన్డీఏ విజయయాత్రలో ఒక పేరు మాత్రం ప్రతీ ఒక్కరి దృష్టినిఆకర్షించింది. ఆ పేరు చిరాగ్ పాశ్వాన్ .
2020లో ఒక్క సీటు కూడా తెచ్చుకోలేని యువ నాయకుడు… ఐదేళ్లలోనే NDAలో అత్యంత ప్రభావశీల శక్తిగా ఎలా మారాడు? అనేప్రశ్నకు ఈ ఎన్నికల ఫలితాలే సమాధానం.
చిరాగ్ పాశ్వాన్ కథ 2020లోనే ముగిసిపోయిందనుకున్నవారికి 2024–25 సమయం ఒక పెద్ద సమాధానం. అప్పట్లో JD(U)తో విభేదాలు, పార్టీ విడిపోవడం, బంధువుల మధ్య నాయకత్వ పోరు, గుర్తుపై కేసులు, చిరాగ్‌పై ఒత్తిడిని పెంచాయి. అయినా కూడా అతను తగ్గలేదు. పార్టీని విస్తరించాడు. ‘‘యువ బిహారి’’ అనే బ్రాండింగ్‌తో దళిత యువసేన(Dalit Youth Connect)ను నిర్మించాడు. 2024లో ఆయన లోక్ జనశక్తి పార్టీ(రామ్ విలాస్)–LJP(RV) ఐదు లోక్‌సభ సీట్లలో పోటీచేసి, అన్నీ గెలిచి NDAలో తిరిగిప్రవేశించింది. ఇదే 2025 అసెంబ్లీ ఎన్నికల్లో అతని పునరాగమనానికి బలం చేకూర్చింది.
2025 ఎన్నికలు — చిరాగ్ పాశ్వాన్ చరిత్రాత్మక ప్రదర్శన

NDAలో BJP–JDU కలిసి 101 చొప్పున పోటీ చేస్తే, చిరాగ్‌కు 29 సీట్లు మాత్రమే ఇచ్చారు. తను ఎక్కువ సీట్లు అడిగినా, ఎన్డీఏ 29 మాత్రమే కేటాయించినా, అసంతృప్తి చెందలేదు. గెలుపే ముఖ్యమనుకున్నాడు. తన ఉనికిని చాటాలనుకున్నాడు. ఫలితాల్లోLJP(RV) 19 సీట్లు గెలుచుకోవడం చిరాగ్ పార్టీని తక్కువ అంచనా వేసామని అందరికీ అర్థమైంది. పాత శత్రువు, కొత్త మిత్రుడైన నితీశ్ కుమార్ (జెడీయూ) సహకారం లేకపోయినా, చిరాగ్ విజయం మాత్రం ఆగలేదు.
ఇది లోక్ జనశక్తి పార్టీ(LJP)కి దాదాపు 20 సంవత్సరాల తర్వాత వచ్చిన అత్యుత్తమ అసెంబ్లీ ఫలితాల ప్రదర్శన. 2005లో రామ్ విలాస్ పాశ్వాన్ నాయకత్వంలో గెలిచిన 29 సీట్ల రికార్డును చిరాగ్ అధిగమించే మార్గంలో ఉన్నాడు. వాస్తవానికి, అతను పోటీచేసిన సీట్లలో 65% స్ట్రైక్ రేట్ సాధించడం రాజకీయంగా సంచలనమే.
ALSO READ : బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ విజృంభణ
చిరాగ్ పాశ్వాన్ : తండ్రి వారసత్వం – బలమైన పునాది, కఠినమైన సవాళ్లు
రామ్ విలాస్ పాశ్వాన్ (Ram Vilas Paswan) బీహార్ రాజకీయాల్లో పెద్దన్న. అదే వారసత్వాన్ని కొనసాగించడం చిరాగ్‌కు చిన్నవ్యవహారం కాదు. 2021లో విభజన తర్వాత, బాబాయ్ పీకే పరాస్ వర్గం నలుగురు ఎంపీలను తీసుకెళ్లడం చిరాగ్నుబలహీనపరిచినట్లనిపించింది. గుర్తు, పార్టీ పేరు, నిబద్ధత అన్నీ ప్రశ్నార్థకమయ్యాయి.
అయినా చిరాగ్, పోరాటం తన DNAలోనే ఉందన్నట్లుగా కొత్త పార్టీని LJP(RV)ను నిర్మించాడు.
NDAలో తిరిగి చేరిక – మోడీపై నిస్వార్థ భక్తి

చిరాగ్ పాశ్వాన్ మోదీపై తన భక్తిని స్పష్టంగా ప్రకటించాడు. ఒకరకంగా చిరాగ్ మోదీకి హనుమంతుడి లాంటి భక్తుడు. నాప్రధాని(మోదీ) ఉన్నంతవరకు నేను ఎక్కడికీ వెళ్ళనన్న అతని నిబద్ధతను ప్రజలు గాఢంగా విశ్వసించారు. 2024లో మోదీమంత్రివర్గంలో ప్రవేశించడం అతని రాజకీయ స్థాయిని మరింత పెంచింది. 2020లో ‘‘Modi se bair nahi, Nitish teri khair nahi’’ అంటూ JD(U)ను బలంగా దెబ్బ కొట్టిన చిరాగ్, ఈసారి అదే JD(U)తో ఒకే కూటమిలో కలిసి నిలబడ్డాడు. నితీశ్ తన ఇంటికి వచ్చికలవడం, JD(U)–LJP(RV) వర్గాలకు ఇచ్చిన ఐకమత్య సంకేతం.. ఇవన్నీ NDAలో కొత్త సర్దుబాటు రాజకీయానికి ఉదాహరణ. మనసులో నితీశ్‌కు 2020 తాలూకు గాయం ఉన్నా, సర్దుకుపోక తప్పలేదు. చిరాగ్ తన విజయాన్ని ‘‘మహిళలు + యువత’’ అనేకొత్త MY ఫార్ములాగా వివరించాడు— ఈ ఫార్ములా ఆర్జేడీ సంప్రదాయ ముస్లిం + యాదవ్ MY ఫార్ములా కంటే విస్తృతమైనమద్దతును సంపాదించింది. ఈ సోషల్ ఇంజనీరింగ్ వల్ల చిరాగ్ NDAలో భవిష్యత్ ఆశాకిరణంగా నిలిచే అవకాశాలు మరింత బలపడ్డాయి.
2030 లక్ష్యాలు – చిరాగ్ యొక్క దీర్ఘకాల దిశ
‘‘బీహార్, యూపీ, పంజాబ్ ఎన్నికల్లో నా పార్టీని బలపరుస్తా. 2029లో నా ప్రధాని నాలుగోసారి గెలవాలి. ఆ తరువాతే 2030 లక్ష్యాలు.” అని చిరాగ్ స్పష్టంగా చెప్పాడు ఇది చిరాగ్ ఒక చిన్న పార్టీ నాయకుడి నుండి రాష్ట్ర భవిష్యత్ నిర్మాతగా ఎదుగుతున్నసంకేతం.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram