Revanth Reddy : రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
ఢిల్లీ లో రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విజయం మరియు స్థానిక ఎన్నికల వ్యూహంపై కీలక చర్చలు జరిపారు.
న్యూఢిల్లీ : ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి శనివారం మధ్యాహ్నం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ లతో సమావేశమయ్యారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, జూబ్లీహిల్స్ నూతన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ సాధించిన విజయం..పార్టీ గెలుపు అంశాలను ఈ సందర్బంగా రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన నవీన్ యాదవ్ ను పరిచయం చేయగా..రాహుల్ గాంధీ ఆయనను అభినందించారు.
అనంతరం రాహుల్, వేణు గోపాల్ లతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై అనుసరించాల్సిన వ్యూహంపై రేవంత్ రెడ్డి చర్చించారు. స్థానిక ఎన్నికల నిర్వహణపై వారి అభిప్రాయాన్ని తీసుకున్నారు. అనంతరం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ తో రేవంత్ రెడ్డి బృందం భేటీ అయ్యింది. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం సాధించిన ఎమ్మెలయ్యే నవీన్ యాదవ్ ను ఖర్గే అభినందించారు. ఖర్గేతో కూడా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఏం చేయాలన్నదానిపై రేవంత్ రెడ్డి చర్చించినట్లుగా సమాచారం.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram