PM Kisan 21st Installment Release Date : రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు

రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం యొక్క 21వ విడత నిధులు ఈ నెల 19న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విడుదల చేయనున్నారు. ఈ పథకం కింద ఇప్పటివరకు 20 విడతల్లో 11 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి రూ. 3.70 లక్షల కోట్లు జమ అయ్యాయి.

PM Kisan 21st Installment Release Date : రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు

విధాత : కేంద్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం 21 విడత నిధులను ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 19న విడుదల చేయనున్నారు. ఈ పథకం కింది ఏడాదికి మూడు దఫాలుగా రూ.2వేలు చొప్పున రూ.6వేలు రైతుల ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం జమ చేస్తున్న సంగతి తెలిసిందే. పీఎం కిసాన్ పథకాన్ని కేంద్రం 2019న ఫిబ్రవరి 24 ప్రారంభించింది.

ఈ పథకం కింద ఇప్పటివరకు 20విడతల్లో 11కోట్ల మంది రైతుల ఖతాల్లోకి రూ. 3.70లక్షల కోట్ల నగదును నేరుగా జమ చేసినట్లుగా కేంద్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది. పీఎం కిసాన్ పథకం అమలు పారదర్శకంగా జరిగేలా..భూమి వివరాలు, బ్యాంక్ ఖాతాలు ఆధార్‌తో లింక్ అయిన రైతుల అకౌంట్లలో డబ్బులు జమ అవుతాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం పీఎం కిసాన్ తో కలిపి తాము ప్రకటించిన అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తుంది.