PM Kisan Funds : రైతులకు గుడ్ న్యూస్..పీఎం కిసాన్ నిధులు ఈ నెలలోనే !
22వ విడత పీఎం కిసాన్ నిధులు ఈ నెలలోనే రైతుల ఖాతాల్లో జమ కావచ్చని అధికార వర్గాలు తెలిపాయి. ఏడాదికి రూ.6000 పెట్టుబడి సాయం కొనసాగుతోంది.
విధాత : కేంద్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయంగా అందిస్తున్న ‘ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ (PM KISAN) పథకం నిధులపై కీలక అప్డేట్ వెలువడింది. 22వ విడత పీఎం కిసాన్ నిధులు ఈ ఫిబ్రవరి నెలలోనే రైతుల ఖాతాలలో జమ కావచ్చని అధికార వర్గాలు సూచిస్తున్నాయి. అయితే దీనిపై వ్యవసాయ శాఖ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. వాస్తవానికి పీఎం కిసాన్ పథకం నిబంధనల మేరకు అర్హులైన రైతులకు ఏడాదికి రూ. 6000లను ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ.2,000 రైతుల ఖాతాలలో జమ చేస్తున్నారు. గత 21విడత నిధులను నవంబర్ నెలలో విడుదల చేశారు. నాలుగు నెలల వ్యవధి ఫిబ్రవరితో ముగిసిపోనుంది. ఈ నేపథ్యంలో ఈ నెలలోనే 22 విడత పీఎం కిసాన్ డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేయవచ్చని అధికార వర్గాల సమాచారం.
బడ్జెట్ లో పెరుగని కేటాయింపులు
2019లో ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి పెట్టుబడి సాయం కింద కేంద్రం ఏటా రూ. 6000 అందిస్తుంది. సాగు ఖర్చులు పెరిగిపోయిన నేపథ్యంలో పీఎం కిసాన్ సహాయ మొత్తాన్ని రూ. 8 వేలకు లేదా 10 వేలకు పెంచాలని ఎప్పటినుంచో రైతులు డిమాండ్ చేస్తున్నారు. అయితే కేంద్రం దీని గురించి పెద్దగా పట్టించుకోలేదు. కేంద్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లోనూ కేటాయింపుల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. అన్నదాతల సంక్షేమం పీఎం కిసాన్ పథకానికి గతంలో మాదిరిగానే రూ.63,500 కోట్లు కేటాయించారు. పథకం ప్రారంభమైన నాటి నుండి ఇప్పటి వరకు ప్రభుత్వం రూ. 3.70 లక్షల కోట్లకు పైగా నిధులను రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసింది . ప్రస్తుతం దేశవ్యాప్తంగా 10 కోట్ల మందికి పైగా రైతులు ఈ ప్రయోజనం పొందుతున్నారు.
దేశంలోని సన్నకారు, చిన్నకారు రైతు కుటుంబాలకు ఈ సహాయం ప్రయోజకరంగా మారింది. ఈ పథకం అమలులో పారదర్శకత కోసం ప్రభుత్వం ఈ-కేవైసీ (eKYC) ప్రక్రియను కఠినతరం చేసింది. భూమి రికార్డులు సరిగ్గా ఉన్నవారికి మాత్రమే ఈ నిధులు అందేలా నిబంధనలు మార్చారు. అనర్హులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందకుండా డిజిటల్ వ్యవస్థను పటిష్టం చేశారు. దీంతో నిధుల దుర్వినియోగం తగ్గి, నిజమైన రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం నిబంధనలు అమలు చేస్తుంది.
ఇవి కూడా చదవండి :
India US Trade Deal| భారత్ తో అమెరికా ట్రేడ్ డీల్..స్టాక్ మార్కెట్ల పరుగులు
HYD-WGL RRTS | హైదరాబాద్–వరంగల్ మధ్య గంట ప్రయాణం.. ‘నమో భారత్’ RRTSతో వరంగల్‌కు మహర్దశ!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram