పీఎం కిసాన్ 23వ విడత నిధులు అప్పుడే..?

కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 23 విడత నిధుల విడుదలకు సంబంధించి కీలక అప్డేట్ వెలువడింది. జులై నెలలో పీఎం కిసాన్ తదుపరి విడత నిధులు (23వ ఇన్‌స్టాల్‌మెంట్) విడుదలయ్యే అవకాశం ఉందని కేంద్ర వర్గాల సమాచారం.

పీఎం కిసాన్ 23వ విడత నిధులు అప్పుడే..?

కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 23 విడత నిధుల విడుదలకు సంబంధించి కీలక అప్డేట్ వెలువడింది. జులై నెలలో పీఎం కిసాన్ తదుపరి విడత నిధులు (23వ ఇన్‌స్టాల్‌మెంట్) విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.

గత మార్చి 13న ప్రధాని నరేంద్ర మోదీ 22వ విడత కింద సుమారు 9.32 కోట్ల మంది రైతులకు రూ. 18,640 కోట్లు పంపిణీ చేశారు. చిన్న, సన్నకారు రైతులకు కేంద్రం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో ఎకరాకు రూ.2,000చొప్పున ఏడాదికి రూ.6,000ఆర్థిక సహాయం అందిసుంది. జులైలో రాబోయే ఈ 23వ విడత నగదు పొందడం కోసం ఇప్పుడే మీ e-KYC , బ్యాంక్ వివరాలను ఒకసారి సరిచూసుకుంటే మంచిది.

దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు పంటల సాగులో ఈ నిధులు పెట్టుబడికి ఉపయోగపడుతున్నాయి. పెరిగిన సాగు వ్యయాన్ని అనుసరించి పీఎం కిసాన్ సహాయ మొత్తం పెంచాలన్న డిమాండ్ రైతుల నుంచి వినిపిస్తున్నప్పటికి కేంద్ర ప్రభుత్వం నుంచి మాత్రం ఈ విషయమై ఎలాంటి సానుకూలత వెల్లడికాలేదు.

ఈ కేవైసీతో పీఎం కిసాన్ డబ్బులు

పీఎం కిసాన్ సహాయం పొందాలనుకునే రైతులు చిన్న, సన్న కారు రైతులై ఉండాలి.  ఈ కేవైసీ(e-KYC)పూర్తి చేసి ఉండాలి. కేవైసీ పూర్తి కాకపోతే ప్రభుత్వం డబ్బులు విడుదల చేయదు. పీఎం కిసాన్ పోర్టల్‌లో ఓటీపీ ద్వారా లేదా మీ సేవ (CSC) కేంద్రాల్లో బయోమెట్రిక్ ద్వారా దీనిని పూర్తి చేయవచ్చు. అలాగే ఆధార్ కార్డులో ఉన్న పేరు, బ్యాంక్ ఖాతాలో ఉన్న వివరాలతో తేడాలు లేకుండా చూసుకోవాలి. ఏ చిన్న అక్షరం తప్పు ఉన్నా పేమెంట్ ఫెయిల్ అవుతుంది. బ్యాంక్ అకౌంట్ నంబర్ లేదా IFSC కోడ్ తప్పుగా ఇవ్వడం, బ్యాంక్ ఖాతా ఇన్-యాక్టివ్‌గా ఉండటం వల్ల డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ఆగిపోయి పీఎం కిసాన్ నిధులు అందకపోవచ్చు.

అనర్హులకు అందని పీఎం కిసాన్..

నెలకు రూ. 10,000 కంటే ఎక్కువ పెన్షన్ తీసుకునే రిటైర్డ్ వ్యక్తులు అర్హులు కారు.  ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టే వారు, సంస్థాగత భూ యజమానులు ఈ పథకానికి అనర్హులుఆదాయపు పన్ను కడుతున్నా లేదా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అర్హత కలిగి ఉన్నా వెరిఫికేషన్ సమయంలో పీఎం కిసాన్ సహాయ దరఖాస్తును తిరస్కరణకు గురవుతుంది. అప్లికేషన్ ప్రాసెస్ సరిగ్గా జరగకపోయినా లేదా వెరిఫికేషన్ పెండింగ్‌లో ఉన్నా రైతు పేరు జాబితాలో ఉండదు.

పథకంలో ఉన్నారా లేరా చెక్ చేసుకోండి..

పీఎం కిసాన్ పథకంలో రైతులు తమ స్టేటస్ తెలుసుకోవడం కోసం అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.in సందర్శించాలి. ‘Know Your Status’ ఆప్షన్ పై క్లిక్ చేసి, మీ రిజిస్ట్రేషన్ నంబర్, క్యాప్చా కోడ్ ఇచ్చి ‘Get Data’ నొక్కితే వివరాలన్నీ స్క్రీన్ పై కనిపిస్తాయి. ఒకవేళ మీరు కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే, ఇదే వెబ్‌సైట్‌లో ‘New Farmer Registration’ ద్వారా ఆధార్ నంబర్ ఇచ్చి అప్లై చేసుకోవచ్చు. ఏవైనా సందేహాలుంటే హెల్ప్‌లైన్ నంబర్లు 155261 లేదా 011-24300606 కు కాల్ చేయవచ్చు.

ఇవి కూడా చదవండి :

జపాన్‌లో ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతుందో తెలిస్తే షాకే..
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్‌లో భారీ ఆఫర్.. ఎన్నడూ లేనంత తక్కువ ధరకే Samsung Galaxy S25 Ultra!