Asian Water Snake | అసోం ‘జూ’లో అరుదైన పాము దర్శనం
అసోం జూలో అరుదైన పాము దర్శనమిచ్చింది. వాస్తవానికి ఇది దేశంలో సర్వసాధారణంగా కనిపిచే ఆసియాటిక్ వాటర్ స్నేక్ అయినప్పటికీ.. అది పసుపుపచ్చని రంగులో మెరిసిపోతుండటం ఆశ్చర్యం రేపింది.
Asian Water Snake | ప్రపంచవ్యాప్తంగా సుమారు మూడు వేల నుంచి నాలుగు వేల సర్పజాతులు ఉంటాయని అంచనా. భారతదేశం విషయానికి వస్తే సుమారు 300 రకాల సర్పజాతులు ఉన్నాయని గణాంకాలను బట్టి తెలుస్తున్నది. అప్పుడప్పుడు కొన్ని అరుదైన జాతుల సర్పాలు తారసపడుతూ ఉంటాయి. ఇలాగే అసోంలోని ఒక జూలో అత్యంత అరుదైన అల్బినో ఆసియాటిక్ వాటర్ స్నేక్ అనే పామును కనుగొన్నారు. చెక్కర్డ్ కీల్‌బ్యాక్ అనే జాతికి చెందినప్పటికీ.. పిగ్మెంటేషన్ అనే సాధారణ జన్యుపరమైన లక్షణం లేకపోవడం విశేషం. జూ అధికారులు దీనిని గుర్తించారు. సుమారు 290 మిల్లీమీటర్ల పొడవు ఉన్న ఈ పాము పిల్ల శరీర నిర్మాణం, చర్మపు పొలుసులు పరిశీలించగా.. ఫాలియా పిస్కేటర్ జాతికి చెందినదిగా నిర్ధారించారు. అంతకు ముందు దీనిని నిర్ధారించుకునేందుకు మూడు రోజులపాటు వివిధ పరీక్షలు చేసి, వాటి ఫలితాలను అధ్యయనం చేసిన తర్వాత ఈ నిర్ధారణకు వచ్చారు. అనంతరం సురక్షిత అటవీ ప్రాంతంలో దానిని వదిలిపెట్టారు.
Delhi blast| ఢిల్లీ పేలుళ్లలో ‘మదర్ ఆఫ్ సైతాన్’ !
చెక్కర్డ్ కీల్‌బ్యాక్ పాము విషరహితం. భారత్‌లో సర్వసాధారణంగా కనిపించే పామే అయినా.. అందులో అల్బినో రూపంలో ఉండటం (పిగ్మెంటేషన్ లేకపోవడం) అత్యంత అరుదు. ఇలాంటి అరుదైన లక్షణాన్ని తాజాగా గుర్తించిన పాములో కనుగొన్నారు. వివరంగా చెప్పాలంటే.. మెలనిన్ పిగ్మెంట్ పూర్తిగా లేక పోవడం వల్ల పాము శరీర రంగు తెల్లగా, లేదా పాలిపోయినట్టుగా కనిపిస్తుందని, కళ్లలో ఎర్రటి జీర ఉంటుందని రెప్టైల్స్ అండ్ యాంఫిబియాన్స్ అనే అంతర్జాతీయ జర్నల్‌లో పబ్లిష్ అయిన అధ్యయనం పేర్కొంటున్నది.
CM Relief Fund issues | సీఎంఆర్ఎఫ్‌కు సీలింగ్!.. వైద్యం ఖర్చు ఎంతైనా ఇచ్చేది అంతేనట!
అసోం స్టేట్ జూకు చెందిన రూపంకర్ భట్టాచార్య, అశ్వినీ కుమార్, దేబబ్రత ఫుకోన్, గువాహటికి చెందిన స్వచ్ఛంద సంస్థ ‘హెల్ప్ ఎర్త్’కు చెందిన ప్రకంజల్ జయాదిత్య పురకాయస్థ ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. గతంలో భారతదేశంలోని గుజరాత్, మహారాష్ట్ర, మిజోరం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలతోపాటు.. నేపాల్‌లోని దనుషాలో అల్బినిజం (పిగ్మెంటేషన్ పూర్తిగా లేకపోవడం), లూజిసం (పెగ్మెంటేషన్ పాక్షికంగా ఉండటం) లక్షణాలు ఉన్న పాములను గుర్తించిననట్టు పరిశోధకులు తెలిపారు. వన్యప్రాణి సంరక్షణ, పరిశోశన కేంద్రంగా అసోం ఎదుగుతున్నదని ఈ కొత్త ఆవిష్కరణ మరోసారి రుజువు చేస్తున్నదని జూ అధికారులు నవంబర్ 14, 2025న జారీ చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అల్బినిజం వంటి అరుదైన జన్యు లక్షణాలపై భారత్‌లో నిర్వహిస్తున్న అధ్యయనాలకు ఇది కీలక ఆధారంగా నిలుస్తున్నదని వారు ఆ ప్రకటనలో తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Lalu Prasad Yadav| ఓటమి వేళ…అంతర్గత కలహాలలో లాలూ కుటుంబం
Nitish Kumar| బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణా స్వీకారానికి ఏర్పాట్లు
Stalin Government| రాష్ట్రపతి నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసిన స్టాలిన్ సర్కార్
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram