Big Snakes| భయపెట్టిన బడా పాములు..చూస్తే హడల్!
పాములు అంటేనే..మనుషులకు హడల్. అందులోనూ భారీ ఆకృతిలోని ప్రాణాంతక పాములను చూస్తే గుండెలు జారిపోవాల్సిందే. ప్రకృతిలోని రకరకాల పాములలో విషపూరిత పాములలో పొడవైనదిగా కింగ్ కోబ్రాను, భారీ ఆకారంలో అనకొండను చెబుతుంటారు. అలాంటి వాటిలో భారీ సైజ్ పాములు తారసపడితే చూసినోళ్లకు దడడడ తప్పదు.
విధాత, హైదరాబాద్ : పాములు అంటేనే..మనుషులకు హడల్. అందులోనూ భారీ ఆకృతిలోని ప్రాణాంతక పాముల(Big Snakes)ను చూస్తే గుండెలు జారిపోవాల్సిందే. ప్రకృతిలోని రకరకాల పాములలో విషపూరిత పాములలో పొడవైనదిగా కింగ్ కోబ్రాను, భారీ ఆకారంలో అనకొండను చెబుతుంటారు. అలాంటి వాటిలో భారీ సైజ్ పాములు తారసపడితే చూసినోళ్లకు దడడడ తప్పదు. అమేజాన్ అడవులు..నదులు భారీ అనకొండలకు నెలవు. దక్షిణ అమెరికాలో ఓ అటవీ ప్రాంతం నుంచి నదిలోకి ఆహారం వేట కోసం వచ్చిన భారీ అనకొండను చూసి పడవలో ప్రయాణిస్తున్న వారు భయాందోళనలకు గురయ్యారు. గ్రీన్ అనకొండ(Green Anaconda) ఆహారం కోసం నదిలోకి దిగడాన్ని వారు వీడియో తీయగా..అదికాస్తా వైరల్ గా మారింది.
నేషనల్ జియోగ్రాఫిక్ డేటా ప్రకారం భారీ గ్రీన్ అనకొండలు పాములు అమెజాన్ బేసిన్ తడి భూములలో నివసిస్తుంటాయి. 30 అడుగుల పొడవు, 550 పౌండ్ల బరువు వరకు పెరుగుతాయి, ఆహారం కోసం నీటిలో కూడా తమ వేటను కొనసాగిస్తూ మనుగడ సాగిస్తున్నాయి.
ధాయ్ లాండ్ వరదల్లో కొట్టుకొచ్చిన భారీ పైథాన్
ఇటీవల దక్షిణ థాయిలాండ్‌లోని హాట్ యాయ్‌లో వరదలు జనజీవనాన్ని అతలాకుతలం చేశారు. వరదల్లో కొండ ప్రాంతాలు, అటవీ ప్రాంతాల నుంచి అనేక పాములు జనావాసాల్లోకి కొట్టుకరావడంతో ప్రజలు మరింత ఇబ్బంది పడ్డారు. హాట్ యాయ్ ప్రాంతం వరదల్లో 15-20 అడుగుల పొడవైన పైథాన్ నీటిల ప్రవహిస్తున్న వీడియో వైరల్ గా మారింది. వరదల్లో కొట్టుకొచ్చిన పాములు జనావాసాలు, పట్టణాల్లో భవనాలపైకి, కార్లపైకి చేరి ప్రజలను తీవ్ర ఇబ్బందులు పాలు కావాల్సి వచ్చింది.
— Intresting nature 🌿🪐 (@INTRESTINGNATUR) December 26, 2025
The size of this snake in Thailand flood pic.twitter.com/IIWL186TfQ
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) December 26, 2025
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram