• Telugu News
  • /Latest news

Bus Driver | ప్ర‌యాణికుల‌ ప్రాణాల‌తో చెల‌గాటం.. ఫోన్‌లో రీల్స్ చూస్తూ బ‌స్సు న‌డుపుతున్న ఆర్టీసీ డ్రైవ‌ర్‌.. షాకింగ్ వీడియో

వ‌రుస ప్ర‌మాదాలు చోటు చేసుకుంటున్నా డ్రైవ‌ర్లు (bus driver) మాత్రం నిర్ల‌క్ష్యాన్ని వీడ‌ట్లేదు. తాజాగా ఓ బ‌స్సు డ్రైవ‌ర్ ఫోన్‌లో రీల్స్ చూస్తూ ప్ర‌యాణికుల ప్రాణాల‌తో చెల‌గాట‌మాడాడు (driver watched reels while driving bus). ఇందుకు సంబంధించిన షాకింగ్ వీడియో వైర‌ల్‌గా మారింది. దీనిపై నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

Reported by: Tejaswini Nanna | Latest News | Feb 07, 2026, 6:54 pm IST
Read Time: 6 mins
Bus Driver | ప్ర‌యాణికుల‌ ప్రాణాల‌తో చెల‌గాటం.. ఫోన్‌లో రీల్స్ చూస్తూ బ‌స్సు న‌డుపుతున్న ఆర్టీసీ డ్రైవ‌ర్‌.. షాకింగ్ వీడియో

Driver Watching Reels While Driving Bus | ఇటీవ‌లే దేశంలో బ‌స్సు ప్ర‌మాదాలు పెరిగిపోయాయి. ఏపీ క‌ర్నూలు, సంగారెడ్డి, క‌ర్ణాట‌క స‌హా ప‌లు రాష్ట్రాల్లో వ‌రుస ప్ర‌మాదాలు జ‌రిగాయి. ఆయా ప్ర‌మాదాల్లో ప‌దుల సంఖ్య‌లో ప్ర‌జ‌లు (passengers) ప్రాణాలు కోల్పోయారు. ఇప్ప‌టికే ఎక్క‌డో ఒక‌చోట బ‌స్సు ప్ర‌మాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇవాళ ఉద‌యం కూడా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా కంచిక‌చ‌ర్ల మండ‌లం కీస‌ర టోల్‌గేట్ (Keesara) వ‌ద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బ‌స్సులో మంట‌లు చెల‌రేగి పూర్తిగా ద‌గ్ధ‌మైంది. అయితే, అదృష్ట‌వ‌శాత్తూ ఎలాంటి ప్రాణ న‌ష్టం సంభ‌వించ‌లేదు. ఇలా వ‌రుస ప్ర‌మాదాలు చోటు చేసుకుంటున్నా డ్రైవ‌ర్లు (bus driver) మాత్రం నిర్ల‌క్ష్యాన్ని వీడ‌ట్లేదు. తాజాగా ఓ బ‌స్సు డ్రైవ‌ర్ ఫోన్‌లో రీల్స్ చూస్తూ ప్ర‌యాణికుల ప్రాణాల‌తో చెల‌గాట‌మాడాడు (driver watched reels while driving bus). ఇందుకు సంబంధించిన షాకింగ్ వీడియో వైర‌ల్‌గా మారింది. దీనిపై నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

కర్ణాటక రాష్ట్రం మండ్య జిల్లాలో కేఎస్ఆర్టీసీ (KSRTC) డ్రైవర్ బాధ్యతారాహిత్యంగా వ్య‌వ‌హ‌రించాడు. ఆ బ‌స్సు మళవల్లి నుంచి మైసూరు వైపు వెళ్తోంది. బ‌స్సు నిండా ప్ర‌యాణికులు ఉన్నారు. సాధార‌ణంగానే ఆ రూట్‌లో ర‌ద్దీ అధికంగా ఉంటుంది. అయినా, స‌ద‌రు బ‌స్సు డ్రైవ‌ర్ నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించాడు. స్టీరింగ్‌పై దృష్టి పెట్ట‌కుండా చేతిలో ఫోన్ ప‌ట్టుకుని రీల్స్ చూస్తూ డ్రైవ్ చేశాడు. ఏమాత్రం తేడా వ‌చ్చిన బ‌స్సు ప్ర‌మాదానికి గుర‌య్యే ఆస్కారం ఎక్కువ‌. అయినా అవేవీ ప‌ట్ట‌న‌ట్టు ప్ర‌యాణికుల ప్రాణాల‌ను గాలికొదిలేసి ఆ డ్రైవ‌ర్ నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించాడు.

ప్రయాణికుల ఆగ్రహం..

డ్రైవ‌ర్ తీరును గ‌మ‌నించిన కొంద‌రు ప్ర‌యాణికులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అత‌డి నిర్ల‌క్ష్యాన్ని వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు. ప్ర‌యాణికుల ప్రాణాల‌తో చెల‌గాట‌మాడుతున్న ఈ డ్రైవ‌ర్‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఆ వీడియో వైర‌ల్ అవుతోంది. దీనిపై నెటిజ‌న్లు సైతం భ‌గ్గుమంటున్నారు. బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించిన డ్రైవర్ తీరుపై ఫైర్ అవుతున్నారు. గ‌తంలో జ‌రిగిన అనేక ప్ర‌మాదాల‌ను ఉటంకిస్తూ నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించిన డ్రైవ‌ర్‌ను విధుల నుంచి తొల‌గించాలంటూ క‌ర్ణాట‌క ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

Cheetah | కూనోలో చిరుత కూన‌ల సంద‌డి.. వీడియో చూశారా..?
Phone Battery Explosion | బాలుడి నోట్లో పేలిన ఫోన్ బ్యాట‌రీ.. షాకింగ్ వీడియో