• Telugu News
  • /National

Cheetah | కూనోలో చిరుత కూన‌ల సంద‌డి.. వీడియో చూశారా..?

దేశంలో చిరుతల సంఖ్య మరింత పెరిగింది. మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని కూనో జాతీయ పార్క్‌ (Kuno National Park)లో నమీబియా నుంచి తీసుకొచ్చిన 'ఆశ' అనే చీతా (Namibian cheetah) ఐదు కూన‌ల‌కు జన్మనిచ్చింది. వీటి రాక‌తో భారత్‌లో మొత్తం చిరుతల సంఖ్య 35కి పెరిగింది.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Feb 07, 2026, 6:31 pm IST
Read Time: 4 mins
Cheetah | కూనోలో చిరుత కూన‌ల సంద‌డి.. వీడియో చూశారా..?

Cheetah | దేశంలో చిరుతల సంఖ్య మరింత పెరిగింది. మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని కూనో జాతీయ పార్క్‌ (Kuno National Park)లో నమీబియా నుంచి తీసుకొచ్చిన ‘ఆశ’ అనే చీతా (Namibian cheetah) ఐదు కూన‌ల‌కు జన్మనిచ్చింది. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ కేంద్ర ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి భూపేంద్ర యాద‌వ్ (Bhupender Yadav) వీడియో పోస్టు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆనందం వ్య‌క్తం చేశారు. భారత గడ్డపై జన్మించి చీతా పిల్లల సంఖ్య 24కి పెరిగిన‌ట్లు తెలిపారు. ఇక‌ వీటి రాక‌తో భారత్‌లో మొత్తం చిరుతల సంఖ్య 35కి పెరిగ‌డం సంతోషక‌ర‌మైన విష‌య‌మ‌ని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. కాగా, ఆశ‌కి ఇది రెండో కాన్పు కావ‌డం విశేషం. ఇప్ప‌టికే కూన పిల్ల‌ల‌కు ఆశ జ‌న్మ‌నిచ్చింది.

దేశంలో అంతరించిపోయిన చీతాల (Cheetahs) పునరుద్ధరణ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే. ప్రాజెక్ట్‌ చీతాలో భాగంగా ఆఫ్రికా నుంచి విడతల వారీగా చీతాలను భారత్‌కు తీసుకొచ్చింది. 2022, సెప్టెంబర్‌ 17న నమీబియా నుంచి ఎనిమిది చిరుతలను భారత్‌కు తీసుకొచ్చింది. అందులో ఐదు ఆడ చీతాలు, మూడు మగ చీతాలు ఉన్నాయి. ఆ తర్వాత ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా నుంచి మరో 12 చిరుతలు వచ్చాయి. వీటన్నింటినీ మధ్యప్రదేశ్‌లోని కూనో నేషనల్‌ పార్క్‌లో వదిలారు. ఆ తర్వాత అనారోగ్య కారణాలతో పలు చిరుతలు మృతి చెందాయి. ప్రస్తుతం కూనో పార్క్‌లో 35 చిరుతలు ఉన్నాయి. వాటిలో 24 భారత్‌లో జన్మించిన కూన పిల్లలు. కాగా, దేశంలో చిరుత ప్రాజెక్ట్ కోసం కేంద్రం ఇప్పటివరకు రూ.112 కోట్లకు పైగా ఖర్చు చేసింది.

ఇవి కూడా చదవండి :

Phone Battery Explosion | బాలుడి నోట్లో పేలిన ఫోన్ బ్యాట‌రీ.. షాకింగ్ వీడియో
Crocodile Spotted In Godavari River : గోదావరి ఒడ్డుకు మొసళ్లు..పాపికొండల పర్యాటకులకు టెన్షన్ !