Mumbai Local Train | బురఖా ధరించి లేడీస్ కంపార్ట్‌మెంట్‌లోకి ఎక్కిన యువకుడు.. తర్వాత ఏమైందంటే..?
ముంబై (Mumbai) ఘట్కోపర్ (Ghatkopar) స్టేషన్ మీదుగా ప్రయాణిస్తున్న లోకల్ ట్రైన్ (Mumbai local train)లోకి ఓ ఆగంతకుడు బురఖా (burqa) ధరించి ప్రవేశించాడు. లేడీస్ కంపార్ట్‌మెంట్‌లోకి ఎక్కాడు.
Mumbai local train | మహారాష్ట్ర ముంబై (Mumbai)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. రద్దీగా ఉండే లోకల్ ట్రైన్ (Mumbai local train)లో ఓ ఆగంతకుడు బీభత్సం సృష్టించాడు. బురఖా (burqa) ధరించి ఏకంగా లేడీస్ కంపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించాడు. అతడు తన ప్రవర్తనతో ప్రయాణికులను అసౌకర్యానికి గురి చేశాడు.
ముంబైలో లోకల్ ట్రైన్స్ ఎంత రద్దీగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉద్యోగులు, విద్యార్థులు, స్థానిక ప్రజలతో ట్రైన్స్ కిక్కిరిసిపోతుంటాయి. కాలుతీసి కాలు పెట్టేందుకు కూడా కష్టంగా ఉంటుంది. అలాంటిది ఓ యువకుడు బురఖా ధరించి లేడీస్ కంపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించాడు. ఘట్కోపర్ (Ghatkopar) స్టేషన్ మీదుగా ప్రయాణిస్తున్న లోకల్ ట్రైన్‌లోకి ఎక్కాడు. అతడి ప్రవర్తనపై అనుమానం వచ్చిన ప్రయాణికులు అతడిని చుట్టుముట్టారు. ఎవరు నువ్వు..? ఎందుకు వచ్చావు..? అంటూ నిలదీశారు. చివరికి బురఖాలో ఉన్నది ఓ యువకుడని తెలుసుకున్నారు.
ట్రైన్ దూకి..
వెంటనే రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అప్రమత్తమైన ఆ ఆగంతకుడు తర్వాతి స్టేషన్ రాకముందే రైలు నుంచి దూకేశాడు. అటుగా వస్తున్న మరో ట్రైన్ ఎక్కి ఉడాయించాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
దొంగతనం కోసమేనా..?
మరోవైపు ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. అతడు మారువేశంలో ఎందుకు వచ్చాడు..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. దొంగతనం కోసమే ఇలా వచ్చి ఉంటాడని అనుమానిస్తున్నారు.
మహిళల భద్రతపై ఆందోళన
సోషల్ మీడియాలో వైరలవుతున్న వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా రైళ్లలో మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని పట్టుకుని తగిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు.
Shocking case on Mumbai local: Man in burqa disguise entered ladies compartment near Ghatkopar, allegedly tried molesting women. Alert passengers challenged him; he escaped by leaping to another train. FIR lodged at Ghatkopar PS; GRP & RPF investigating.
pic.twitter.com/GgqccoX11M— Ghar Ke Kalesh (@gharkekalesh) February 8, 2026
ఇవి కూడా చదవండి :
Disha Patani | గ్లామర్‌తో చంపకే పిల్లా.. ట్రెడిషనల్ డ్రెస్ లో అదిరిపోయే లుక్‌లో దిశా పటాని
Gold, Silver Price Today| స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram