Errabelli Dayakar Rao : కంటతడి పెట్టిన మాజీ మంత్రి ఎర్రబెల్లి..వీడియో వైరల్

తొర్రూర్ మున్సిపల్ ఎన్నికల వివాదంపై మాజీ మంత్రి ఎర్రబెల్లి కంటతడి. లాటరీతో కాంగ్రెస్ విజయం, వీడియో సోషల్ మీడియాలో వైరల్.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Feb 17, 2026, 4:11 pm IST
Read Time: 3 mins
Errabelli Dayakar Rao : కంటతడి పెట్టిన మాజీ మంత్రి ఎర్రబెల్లి..వీడియో వైరల్

విధాత : తొర్రూర్ మున్సిపాల్టీ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ఎన్నికల సందర్బంగా ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించిన తీరుపై బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బోరు మంటూ కంటతడిపెట్టారు. ఎర్రబెల్లి కన్నీరు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రెండు రోజులుగా పది వేల మంది కార్యకర్తలు నా కోసం, మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కోసం నిద్రాహారాలు మాని కష్టపడ్డారన్నారు. కార్యకర్తల కష్టం చూస్తుంటే నాకు బాధ అనిపిస్తుందని, అసలు రాజకీయాల్లో నేను ఉండాల్నా..పోవాల్నా నాకైతే అర్ధం కావడం లేదంటూ వాపోయారు. పోలీసులు నన్ను అరెస్టు చేసి నిర్బంధించారని, బీఆర్ఎస్ ఇతర నాయకులను సైతం నిర్బంధించారని, అక్రమంగా మున్సిపల్ ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ అన్ని అడ్డదారులు తొక్కిందని విమర్శించారు.

తొర్రూర్ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ లకు చేసి సమానంగా ఓట్లు రావడంతో లాటరీ నిర్వహించారు.లాటరీలో కాంగ్రెస్‌ అభ్యర్థి తుణం శ్రావణ్ మున్సిపల్‌ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. అటు జనగామ మున్సిపాలిటీ చైర్మన్‌ ఎన్నికలో కూడా ఓట్లు సమానంగా రావడంతో అధికారులు లాటరీ పద్ధతి చేపట్టి విజేతను ప్రకటించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి బాలమణి విజేతగా నిలిచారు.

ఇవి కూడా చదవండి :

Pratyusha | ప్రత్యూష ఆత్మహత్య కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు .. సిద్ధార్థ్ రెడ్డి లొంగిపోవాలని ఆదేశాలు
CPI(M) protest Delhi| మార్చి 24న ఢిల్లీలో సీపీఎం ధ‌ర్నా