Indian Railways | మీకు తెలుసా.. రైలు ఆలస్యమైతే ఫ్రీగా ఫుడ్‌ పొందొచ్చు..!

Indian Railways | భారతీయ రైల్వేస్‌ (Indian Railways)లో ‘ఆలస్యం’ అనే మాట సర్వసాధారణమే. రైలు సమయానికి రాదు (Train delays). ఎప్పుడూ లేటే. కొన్ని రైళ్లు నిమిషాల కొద్దీ ఆలస్యం అవగా.. మరికొన్ని కొన్ని గంటలపాటూ ఆలస్యంగా నడుస్తూ ప్రయాణికుల సహనాన్ని పరీక్షిస్తుంటాయి.

  • By: raj |    national |    Published on : Jan 16, 2026 9:00 PM IST
Indian Railways | మీకు తెలుసా.. రైలు ఆలస్యమైతే ఫ్రీగా ఫుడ్‌ పొందొచ్చు..!

Indian Railways | భారతీయ రైల్వేస్‌ (Indian Railways)లో ‘ఆలస్యం’ అనే మాట సర్వసాధారణమే. రైలు సమయానికి రాదు (Train delays). ఎప్పుడూ లేటే. కొన్ని రైళ్లు నిమిషాల కొద్దీ ఆలస్యం అవగా.. మరికొన్ని కొన్ని గంటలపాటూ ఆలస్యంగా నడుస్తూ ప్రయాణికుల సహనాన్ని పరీక్షిస్తుంటాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. గంటల కొద్దీ రైల్వే స్టేషన్లలోనే పడిగాపులు కాస్తుంటారు. అదేసమయంలో రైల్వే రూల్స్‌ ప్రయాణికులకు కాస్త ఊరటిస్తుంటాయి. అలాంటి రూలే ఫ్రీ ఫుడ్‌.

మీకు తెలుసా.. మీరు వెళ్లాల్సిన ట్రైన్‌ ఆలస్యమైతే ప్రయాణికులకు ఉచితంగా ఆహారం (free food) అందజేస్తారు. ఐఆర్‌సీటీసీ క్యాటరింగ్‌ పాలసీ కింద నిర్దేశిత సమయం కన్నా రెండు లేదా అంతకంటే ఎక్కువ గంటలు ఆలస్యమైన రైళ్లలో ప్రయాణికులకు ఉచిత భోజనం లేదా అల్పాహారం అందజేస్తారు. రైలు కోసం వేచి చూస్తున్న వారికి దీనిని అందజేస్తారు. అయితే ఈ ఉచిత భోజన సౌకర్యం రాజధాని, శతాబ్ది, దురంతో లాంటి ప్రీమియం రైలు ప్రయాణికులకు మాత్రమే వర్తిస్తుంది.

ఫ్రీ ఫుడ్‌ పాలసీని రైల్వే శాఖ 2024 చివర్లోనే ప్రకటించింది. అయితే, దీని గురించి జనవరి 8వ తేదీన ఓ ప్రయాణికుడు పోస్టు పెట్టడంతో ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. సదరు నెటిజన్‌ ప్రయాణించే రాజధాని రైలు దాదాపు ఆరు గంటలు ఆలస్యం కావడంతో వారికి ఈ ఫ్రీ భోజనం అందింది. దీంతో ఈ విషయాన్ని తెలియజేస్తే సదరు నెటిజన్‌ పోస్టు పెట్టాడు. ఈ బెన్‌ఫిట్‌ గురించి తెలియని వారు నెటిజన్‌ పోస్టు చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.