Doctor Shipra Dhar | ఆమె డాక్టర్ కాదు దేవత.. 500 డెలివరీలు ఉచితం
Doctor Shipra Dhar | దేవుడు( God ) జన్మనిస్తే వైద్యుడు( Doctor ) పునర్జన్మను ఇస్తాడని చెబుతుంటారు. నిజంగా ఇది అక్షర సత్యం. ప్రాణాలు పోయే స్థితిలో ఉన్న వారికి కూడా ప్రాణం పోసే శక్తి ఒక్క వైద్యుడికి మాత్రమే ఉంటుంది. ప్రాణం పోయడమే కాదు.. చాలా మంది డాక్టర్లు ఉచితంగా సేవలందించి నిరుపేదల( Poor People ) పాలిట దేవుళ్లుగా మారుతారు.

Doctor Shipra Dhar | దేవుడు( God ) జన్మనిస్తే వైద్యుడు( Doctor ) పునర్జన్మను ఇస్తాడని చెబుతుంటారు. నిజంగా ఇది అక్షర సత్యం. ప్రాణాలు పోయే స్థితిలో ఉన్న వారికి కూడా ప్రాణం పోసే శక్తి ఒక్క వైద్యుడికి మాత్రమే ఉంటుంది. ప్రాణం పోయడమే కాదు.. చాలా మంది డాక్టర్లు ఉచితంగా సేవలందించి నిరుపేదల( Poor People ) పాలిట దేవుళ్లుగా మారుతారు. అలాంటి డాక్టర్లకు పేదలు చేతులెత్తి మొక్కుతారు. అలాంటి డాక్టర్ల సరసన ఓ మహిళా డాక్టర్( Woman Doctor ) నిలిచింది. ఆమె ఎంతో మందికి ఉచితంగా డెలివరీలు( Free Delivery ) చేసి గొప్ప మనసు చాటుకున్నారు. పేద మహిళల ఇంట్లో మహాలక్ష్మిగా స్థానం సంపాదించుకున్నారు. మరి ఆ దేవత.. అదేనండి ఆ మహిళా డాక్టర్ గురించి తెలుసుకోవాలంటే వారణాసి( Varanasi ) వెళ్లక తప్పదు.
ఉత్తరప్రదేశ్( Uttar Pradesh )లోని వారణాసి పట్టణానికి చెందిన డాక్టర్ శిప్రా ధార్( Doctor Shipra Dhar) వృత్తిరీత్యా గైనకాలజిస్ట్ డాక్టర్. ఆమెకు సొంతంగా ఓ హాస్పిటల్( Hospital ) ఉంది. ఈ దవఖానాలో నిరుపేద మహిళలు( Poor Womans ) ఎక్కువగా వైద్యం పొందుతుంటారు. ఇక్కడ డెలివరీలకు వచ్చే మహిళలకు డాక్టర్ శిప్రా ధార్ ఓ తల్లిలా బాధ్యత తీసుకుంటుంది. 2014 నుంచి ఇప్పటి వరకు ఆమె వేల డెలివరీలు చేసింది. అయితే తన ఆస్పత్రిలో డెలివరీ కోసం వచ్చే మహిళలకు ఓ మంచి ఆఫర్ ప్రకటించింది. నార్మల్ డెలివరీ( Normal Delivery ) ద్వారా కానీ, సీజేరియన్( C Section ) ద్వారా కానీ.. ఆడపిల్ల( Girl Child ) పుడితే ఆ దంపతుల నుంచి ఒక్క రూపాయి కూడా వసూలు చేయలేదు. ఉచితంగానే వైద్య సేవలందిస్తుంది. అలా ఇప్పటి వరకు 500 మంది మహిళలకు ఉచితంగా డెలివరీ చేసి గొప్ప మనసు చాటుకుంది. ఆడపిల్ల పుట్టిన దంపతుల్లో సంతోషం నింపేందుకు హాస్పిటల్‌లోనే గ్రాండ్‌గా సెలబ్రేషన్స్ కూడా నిర్వహిస్తున్నారు. ఆడపిల్ల అనే భావన తల్లిదండ్రుల్లో రావొద్దనే ఉద్దేశంతో ఇదంతా చేస్తున్నట్లు డాక్టర్ శిప్రా ధార్ పేర్కొంది.
ఉచితంగా డెలివరీలు చేయడమే కాదు.. 12 మంది నిరుపేద అమ్మాయిలకు ఉచితంగా విద్యను అందిస్తున్నారు. 25 మంది బాలికలకు సుకన్య సమృద్ధి( Sukanya Samriddhi ) యోజన పథకానికి సంబంధించిన డబ్బులను కడుతున్నారు. ఓ ఫుడ్ బ్యాంక్( Food Bank )ను కూడా నిర్వహిస్తున్నారు. దీంతో పోషకాహారం లోపం పిల్లలకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తూ.. వారి ఎదుగుదలకు తోడ్పాటును అందిస్తున్నారు. ఈ క్రమంలో కొన్నిసార్లు హాస్పిటల్ నిర్వహణకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ పేదలకు సహాయం చేస్తున్న ఆలోచన గుర్తుకు వచ్చి.. కష్టాన్ని ఇష్టంగా మలుచుకుని సేవ చేస్తున్నట్లు డాక్టర్ శిప్రా ధార్ చెప్పారు.