Negligence | వైద్యుల నిర్లక్ష్యం నాలుగేళ్ల చిన్నారికి శాపం.. చేతికి బదులుగా నాలుకకు సర్జరీ..!
Negligence | ఆపరేషన్ చేసిన వైద్యుల నిర్లక్ష్యం ఓ నాలుగేళ్ల చిన్నారి పాలిట శాపంగా మారింది. చిన్నారి చేతికి ఉన్న ఆరో వేలును తీయించేందుకు తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్తే వైద్యులు నాలుకకు సర్జరీ చేశారు. కేరళ రాష్ట్రంలోని కోజికోడ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ విషయం ఆ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు కోజికోడ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Negligence : ఆపరేషన్ చేసిన వైద్యుల నిర్లక్ష్యం ఓ నాలుగేళ్ల చిన్నారి పాలిట శాపంగా మారింది. చిన్నారి చేతికి ఉన్న ఆరో వేలును తీయించేందుకు తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్తే వైద్యులు నాలుకకు సర్జరీ చేశారు. కేరళ రాష్ట్రంలోని కోజికోడ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ విషయం ఆ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు కోజికోడ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నాలుగేళ్ల పాపకు ఆరో వేలు ఉండటంతో దాన్ని తొలగించేందుకు తల్లిదండ్రులు కోజికోడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. శస్త్రచికిత్స నిమిత్తం చిన్నారిని గురువారం ఆపరేషన్ థియేటర్‌లోకి తీసుకెళ్లారు. అక్కడ చేతికి బదులుగా సర్జరీ కోసం నాలుక కోశారు. ఆ తర్వాత పొరపాటును గ్రహించి బయటకు తీసుకొచ్చారు. పాప నోట్లో దూది కుక్కి ఉండటాన్ని తల్లిదండ్రులు గమనించి ఆరా తీయగా.. వైద్యుడి నిర్లక్ష్యం బయటపడింది.
చిన్నారి అవస్థను చూసి ఆ తల్లిదండ్రులు విలవిల్లాడారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వైద్యుల నిర్లక్ష్యానికి సంబంధించిన ఈ సంగతి రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో రాష్ట్రం ప్రభుత్వం స్పందించింది. ప్రాథమిక విచారణ ఆధారంగా విధుల్లో అలసత్వం ప్రదర్శించిన వైద్యుడు బెజోన్ జాన్సన్‌ను సస్పెండ్ చేసినట్లు ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జి ప్రకటించారు.
అనంతరం మంత్రి ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తుకు ఆదేశించారు. కాగా ‘మరెవరికీ ఇలాంటి పరిస్థితి రాకూడదు. శస్త్రచికిత్సలో జరిగిన పొరపాటు వల్ల పాపకు భవిష్యత్తులో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే ఆస్పత్రి వాళ్లే బాధ్యత తీసుకోవాలి. ఒకేరోజు రెండు ఆపరేషన్లు ఉండటంతో వైద్యుడు పొరపాటు పడినట్లు ఆస్పత్రి యాజమాన్యం తెలిపింది. వైద్యుడు కూడా క్షమాపణ చెప్పారు’ అని తల్లిదండ్రులు వెల్లడించారు.