విధాత : తాగిన మైకంతో నిర్లక్ష్యమైన డ్రైవింగ్ చేసి 11ఏళ్ల బాలికను ఢీ కొట్టి చంపి..వాహనంతో అడ్డొచ్చిన బారికేడ్లను గుద్దేస్తూ వెళ్లిపోతున్న ట్రక్కు డ్రైవర్ ను పోలీసులు సినిమా ఫక్కీలో ఛేజింగ్ చేసి మరి పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
ఛత్తీస్‌గఢ్‌లో మద్యం మత్తులో ఓ ట్రక్కు డ్రైవర్ 11 ఏళ్ల బాలికను ఢీకొట్టి చంపాడు. వాహనం ఆపకుండా పారిపోతున్న అతడిని పోలీసులు సినిమా ఫక్కీలో 60 కిలోమీటర్లు వెంటాడారు. బ్యారికేడ్లను బద్దలు కొడుతూ దూసుకెళ్లిన ట్రక్కును వెంబడించి మహారాష్ట్ర సరిహద్దు వద్ద పట్టుకున్నారు. రెండు గంటల ఛేజింగ్ తర్వాత గాయపడిన డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసు మర్యాదాలతో ఘటన వివరాలపై నిందితుడిని ప్రశ్నించి వివరాలు రాబట్టారు.
సినిమాను తలపించిన ఛేజింగ్.. బాలికను చంపి
ఛత్తీస్‌గఢ్‌లో మద్యం మత్తులో ఓ ట్రక్కు డ్రైవర్ 11 ఏళ్ల బాలికను ఢీకొట్టి చంపాడు. పారిపోతున్న అతడిని పోలీసులు సినిమా ఫక్కీలో 60 కిలోమీటర్లు వెంటాడారు. బ్యారికేడ్లను బద్దలు కొడుతూ దూసుకెళ్లిన ట్రక్కును, మహారాష్ట్ర సరిహద్దు వద్ద… pic.twitter.com/Itf0SuLJ32
— ChotaNews App (@ChotaNewsApp) June 27, 2026
