ED Notice : రాబిన్ ఉతప్ప, యువరాజ్ సింగ్, సోనూసూద్ లకు ఈడీ నోటీసులు

ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. రాబిన్ ఉత్తప్ప, యువరాజ్ సింగ్, సోనూసూద్ కు విచారణ నోటీసులు జారీ చేసింది.

ED Notice : రాబిన్ ఉతప్ప, యువరాజ్ సింగ్, సోనూసూద్ లకు ఈడీ నోటీసులు

న్యూఢిల్లీ : ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్లు రాబిన్ ఉతప్ప, యువరాజ్ సింగ్ లకు, నటుడు సోనూసూద్ లకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న విచారణకు రావాలని మాజీ క్రికెటర్ రాబిన్ ఉత్తప్పకు, 23న యువరాజ్ సింగ్‌కు, 24న నటుడు సోనూసూద్‌కు విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. బెట్టింగ్ ప్లాట్‌ఫామ్ 1ఎక్స్ బీఈటీ సోషల్ మీడియా ప్రమోషన్‌లకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా వారిని ఈడీ విచారించ‌నుంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద వారి వాంగ్మూలాలను నమోదు చేయ‌నున్నారు. ఇప్ప‌టికే ఈ కేసులో భార‌త మాజీ క్రికెట‌ర్లు సురేష్ రైనా, హర్భన్ సింగ్, శిఖ‌ర్ దావ‌న్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ విచారించింది.

బెట్టింగ్‌ యాప్స్‌ను ప్రమోట్‌ చేసిన కారణంగా ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు విచారణ ఎదుర్కొన్న విషయం తెలిసిందే. టాలీవుడ్‌ సినీ ప్రముఖులు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మి సైతం విచారణకు హాజరయ్యారు. అలాగే పలువురు సినీ హీరోహీరోయిన్లు, టీవీ నటులు, యాంకర్లు, యూ ట్యూబ్ ఇన్ ఫ్లుయర్స్ ఈ కేసులలో విచారణ ఎదుర్కొన్నారు.