పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఏనుగు..వీడియో వైరల్
పశ్చిమబెంగాల్‌లోని ఝార్‌గ్రామ్‌లో జితుచూసేందుకుసోల్ ప్రాథమిక పాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద ఓ భారీ అడవి ఏనుగు కనిపించింది. పోలింగ్ బూత్ వెలుపల కనిపించిన ఏనుగును చూసేందుకు స్థానికులు, ఓటర్లు ఎగబడ్డారు.
అడవిలో ఉండాల్సిన ఏనుగు కాస్తా..గ్రామంలోకి వచ్చింది. పంటలను తినేందుకు.. లేక ఊరిలో తినేందుకు మరేదైన ఆహార పదార్ధాలు దొరుకుతాయమోనన్న ఆశతో గ్రామంలో ఏనుగు తిరుగాడింది. దారిలో ఉన్న ఓ పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్లింది. అక్కడ ఏనుగును చూసి ఓటర్లు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
పశ్చిమబెంగాల్‌లోని ఝార్‌గ్రామ్‌లో జితుసోల్ ప్రాథమిక పాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద ఓ భారీ అడవి ఏనుగు కనిపించింది. పోలింగ్ బూత్ వెలుపల ఏనుగు కనిపించడంతో చూసేందుకు స్థానికులు, ఓటర్లు ఎగబడ్డారు. ఈ వ్యవహారంతో పోలింగ్ ప్రక్రియకు కాసేపు ఆటంకం ఏర్పడింది. ఆ ఒంటరి గజరాజు మాత్రం ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా. అక్కడున్న వాహనాలను పరిశీలిస్తూ, తన ఆహార అన్వేషణలో భాగంగా పోలింగ్ కేంద్రం వద్దకు ఓటర్లు తరలివచ్చిన వాహనంలో తనకు తినేందుకు ఏమైనా ఉన్నాయా అని పరిశీలించి తన దారిని తాను తాపీగా ముందుకు వెళ్లిపోయింది.
ఏనుగు రాకతో ఆశ్చర్యపోయిన గ్రామస్తులు, పోలింగ్ సిబ్బంది, భద్రతా సిబ్బంది దాని రాకపోకలను తమ సెల్ ఫోన్లలో ఫోటోలు, వీడియోలు తీసుకుని మురిసిపోయారు. చిత్రంగా ఆ గజరాజు.. తన రాకతో గ్రామస్తులు ఎంత హడావుడి చేసి ఇబ్బంది పెట్టినా పట్టించుకోకుండా ప్రశాంతంగా ముందుకు వెళ్లపోవడం విశేషం.
🚨Video from Jhargram, Bengal where an elephant 🐘 today came to a polling booth in a village.😂
After Modi ji visited Jhargram, even elephants are coming out to vote in this Bengal election🙏 #BengalElections #BengalRejectsMamata #Elephant #VotingDay #Vote #BJP4Bengal pic.twitter.com/50fogwIGkT
— Amitabh Chaudhary (@MithilaWaaala) April 23, 2026
ఇవి కూడా చదవండి :
భారత దేశ అధికారిక పటంలో ఏపీ రాజధానిగా అమరావతి!
DOST – CPGET | దోస్త్ ద్వారానే సీపీగెట్ ప్రవేశాలు.. వివరాలివే..!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram