దేశంలోనే తొలి సీ ప్లేన్ ప్రయోగం సక్సెస్

దేశంలో తొలి సీప్లేన్ పరీక్ష హరిద్వార్‌లో విజయవంతమైంది. నీటిపై ల్యాండింగ్ చేసే ఈ విమానం పర్యాటక, రవాణా రంగాలకు కీలకంగా మారనుంది.

Seaplane at ganga haridwar barrage

విధాత : దేశంలోనే తొలిసారిగా నిర్వహించిన సీప్లేన్(నీటిపై దిగగలిగే విమానం) ప్రయోగ పరీక్ష విజయవంతమైంది. హరిద్వార్‌ గంగా బ్యారేజీపై సీప్లేన్ పరీక్షను విజయవంతంగా నిర్వహించారు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌ గంగా బ్యారేజీపై ‘డి హావిలాండ్ కెనడా DHC-6 ట్విన్ ఓటర్’ విమానం సీప్లేన్‌గా మారి విజయవంతంగా గాలిలోకి ఎగిరింది.

సాధారణ విమానానికి ఫ్లోట్లను అమర్చి, నీటిపై నుంచి టేకాఫ్, ల్యాండింగ్ చేసేలా దీన్ని రూపొందించారు. SkyHop Aviation సంస్థ సీఈవో అవని సింగ్ నేతృత్వంలో ఈ పరీక్ష నిర్వహించారు. SkyHop Aviation సంస్థ చేపట్టిన 19 సీట్ల De Havilland DHC-6 Twin Otter సీప్లేన్ ట్రయల్ ల్యాండిగ్ చారిత్రాత్మక ప్రయోగం పరీక్ష సక్సెస్ తో దేశంలో పర్యాటకం, మారుమూల ప్రాంతాలకు వైమానిక అనుసంధానాన్ని మెరుగుపరచడంలో కీలక ముందడుగు వంటిదని అధికారులు తెలిపారు. ముఖ్యంగా లక్షద్వీప్ దీవులను అనుసంధానించడం, అలాగే ఇతర రాష్ట్రాల్లో (ఏపీతో సహా) సీప్లేన్ సేవలను విస్తరించడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. ఈ సీప్లేన్ ప్రయాణం నీటిపై, నేలపై కూడా ల్యాండ్ అవ్వగలడం విశేషం. ఈ ప్రాజెక్టును కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, డీజీసీఏ సహకారంతో చేపట్టారు.

మరోవైపు ఇప్పటికే మన దేశంలో రెండు చోట్ల సీ ప్లేన్ సర్వీసులు ప్రారంభించినప్పటికి అవి మధ్యలోనే ఆగిపోయాయి. అండమాన్ నికోబార్ దీవులతో పాటుగా, గుజరాత్‌లోనూ సీ ప్లేన్ సర్వీసులు ప్రారంభించారు. దేశంలోనే తొలి సీ ప్లేన్ సర్వీసును గుజరాత్‌లో ప్రారంభించారు. కెవాడియాలోని సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఐక్యతా విగ్రహం నుంచి అహ్మదాబాద్‌లోని సబర్మతి రివర్ ఫ్రంట్ మధ్య సీ ప్లేన్ సర్వీసును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2020 నవంబర్‌లో ప్రారంభించారు. 2023 ఏప్రిల్ నుంచి ఈ సీ ప్లేన్ సేవలు నిలిపివేశారు. 2024 నవంబర్ 9న విజయవాడ ప్రకాశం బ్యారేజీ టూ శ్రీశైలం వకరు సీ ప్లేన్ సర్వీసును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అది కూడా మధ్యలోనే ఆగిపోయింది.

ఇవి కూడా చదవండి :

Trisha | త్రిష‌పై జోరుగా రూమ‌ర్స్..విజయ్‌తో రిలేష‌న్‌ నుంచి రిటైర్మెంట్ వరకు… స్ట్రాంగ్ కౌంటర్‌తో చెక్
ఎలక్ట్రిక్ వాహనాల రాయితీలో మారుతి కంపెనీ కూడా: మంత్రి పొన్నం

Latest News