Trisha | త్రిషపై జోరుగా రూమర్స్..విజయ్‌తో రిలేషన్ నుంచి రిటైర్మెంట్ వరకు… స్ట్రాంగ్ కౌంటర్‌తో చెక్
Trisha | దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా తనదైన ముద్ర వేసుకున్న త్రిష కృష్ణన్ మరోసారి వార్తల్లో నిలిచారు. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అగ్రస్థానాన్ని అందుకున్న త్రిష, ఒక దశలో అత్యధిక డిమాండ్ ఉన్న హీరోయిన్‌గా కొనసాగారు.
Trisha | దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా తనదైన ముద్ర వేసుకున్న త్రిష కృష్ణన్ మరోసారి వార్తల్లో నిలిచారు. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అగ్రస్థానాన్ని అందుకున్న త్రిష, ఒక దశలో అత్యధిక డిమాండ్ ఉన్న హీరోయిన్‌గా కొనసాగారు.
సెకండ్ ఇన్నింగ్స్‌లో జోరు
కొంత విరామం తర్వాత సెకండ్ ఇన్నింగ్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన త్రిష, పొన్నియన్ సెల్వన్ సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. ఆ చిత్రంలో ఆమె నటనకు భారీ ప్రశంసలు లభించాయి. దీంతో ఆమె క్రేజ్ మళ్లీ పెరిగింది. అయితే తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోకపోయినా, ఆమె కెరీర్‌పై ప్రభావం మాత్రం పడలేదు.
విజయ్‌తో సంబంధం?
ఇటీవల త్రిష వ్యక్తిగత జీవితం గురించి సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా తమిళ స్టార్ విజయ్‌తో ఆమె రిలేషన్‌పై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇద్దరూ కలిసి పలు కార్యక్రమాల్లో కనిపించడం, ఒకే ఈవెంట్లకు హాజరవడం ఈ రూమర్స్‌కు మరింత బలం చేకూర్చింది.
విజయ్ – సంగీత వివాదం
ఇక విజయ్ మరియు ఆయన భార్య సంగీత మధ్య విభేదాలు, విడాకుల వార్తలు కూడా ఈ అంశాన్ని మరింత హాట్ టాపిక్ చేశాయి. ఈ వ్యవహారంలో త్రిష పేరు రావడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఈ అన్ని రూమర్స్‌కు త్రిష ఘాటుగా స్పందించారు. తనపై వస్తున్న అసత్య ప్రచారాలను ఖండిస్తూ, సెటైరికల్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. నాకు ఇప్పటికే నలుగురు పిల్లలట… ఇంకా ఏమైనా ఉంటే చెప్పండి, ఈరోజుకి ఈ రూమర్స్ చాలు” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఈ ఒక్క పోస్ట్‌తోనే పుకార్లకు గట్టి సమాధానం ఇచ్చినట్లైంది.
రిటైర్మెంట్ గాసిప్స్ కూడా
ఇటీవల త్రిష సినిమాలకు గుడ్‌బై చెప్పబోతున్నారనే వార్తలు కూడా వినిపించాయి. అయితే వాటిపై కూడా ఆమె పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఆమె ఫోకస్ పూర్తిగా సినిమాలపైనే ఉందని స్పష్టం చేశారు.త్రిష వ్యక్తిగత జీవితంపై రూమర్స్ రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఆమె ఎంగేజ్‌మెంట్ రద్దు అయిన తర్వాత నుంచి పెళ్లి గురించి తరచూ వార్తలు వస్తూనే ఉన్నాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram