మహిళ జుట్టు దువ్విన బీజేపీ మాజీ ఎమ్మెల్యే.. వీడియో

ఆయనో బీజేపీ నాయకుడు.. మాజీ ఎమ్మెల్యే కూడా. మహిళలంటే ఆయనకు పిచ్చి. గతంలోనూ ఆయనపై అత్యాచార కేసులు నమోదు అయ్యాయి. తాజాగా ఓ మహిళ జుట్టు దువ్వి మళ్లీ వార్తల్లో నిలిచారు

మహిళ జుట్టు దువ్విన బీజేపీ మాజీ ఎమ్మెల్యే.. వీడియో

ఆయనో బీజేపీ నాయకుడు.. మాజీ ఎమ్మెల్యే కూడా. మహిళలంటే ఆయనకు పిచ్చి. గతంలోనూ ఆయనపై అత్యాచార కేసులు నమోదు అయ్యాయి. తాజాగా ఓ మహిళ జుట్టు దువ్వి మళ్లీ వార్తల్లో నిలిచారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బీజేపీ మాజీ ఎమ్మెల్యే సురేశ్ రాథోడ్.. తన ఆశ్రమంలో ఉండే ఓ మహిళతో అన్యోన్యంగా ఉంటున్నారు. అయితే మహిళ జుట్టును దువ్వుతుండగా.. ఆమె వీడియో చిత్రీకరించారు. అనంతరం ఆ వీడియోను సచిన్ గుప్తా అనే వ్యక్తి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.

అయితే ఆ వీడియోలో కనిపిస్తున్న మహిళ ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్ నివాసి అని తెలుస్తోంది. ఆమెకు తన భర్తతో గొడవలు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆవిడ సురేశ్‌ రాథోడ్‌ ఆశ్రమంలో ఉద్యోగినిగా పని చేస్తోంది. అయితే ఈ సన్నివేశం భాబీ బీ విధాయక్‌ హై మూవీలోని సన్నివేశమని రాథోడ్ పేర్కొన్నారు. 2021లో, సురేశ్ రాథోడ్‌పై మహిళా పార్టీ కార్యకర్త ఫిర్యాదు చేయడంతో అతనిపై అత్యాచారం ఆరోపణలపై కేసు నమోదు చేయబడింది.