Credit Card Loyalty | ఈ మూడు క్రెడిట్ కార్డులుంటే..! స్టార్ హోటల్‌లో ఫ్రీగా అకామిడేషన్..!
డిసెంబర్ ముగింపునకు వచ్చేస్తున్నది. 2023కు వీడ్కోలు పలుకుతూ.. 2024 సంవత్సరానికి స్వాగతం పలుకబోయేందుకు సమయం దగ్గరపడుతున్నది

Credit Card Loyalty | డిసెంబర్ ముగింపునకు వచ్చేస్తున్నది. 2023కు వీడ్కోలు పలుకుతూ.. 2024 సంవత్సరానికి స్వాగతం పలుకబోయేందుకు సమయం దగ్గరపడుతున్నది. అదే సమయంలో నెలాఖరులో క్రిస్మస్‌కు సెలవులు నాలుగైదు రోజులు సెలవులు రాబోతున్నాయి. అయితే, సెలవులను కుటుంబంతో సహా గడిపేందుకు చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. ఇందు కోసం పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. అయితే, ప్రస్తుత కాలం క్రెడిట్‌కార్డులు చాలా మందే వినియోగిస్తున్నారు. క్రెడిట్‌కార్డ్ రివార్డ్ పాయింట్లను హోటల్ లాయల్టీ ప్రోగ్రామ్‌తో మార్చుకొని ఫైవ్ స్టార్ హోటల్‌లో బస చేసే వీలుతున్నది. ఏయే కార్డులపై లాయల్టీ ప్రోగ్రామ్ అందుబాటులో ఉందో ఓ సారి తెలుసుకుందాం రండి..!
హోటల్ లాయల్టీ ప్రోగ్రామ్ అంటే..?
హోటల్ లాయల్టీ ప్రోగ్రామ్ అంటే.. మీరు హోటల్లో బస చేసినప్పుడు మీకు అనేక ప్రయోజనాలను అందించే మెంబర్‌షిప్ ప్రోగ్రామ్ ఇది. కొత్త కస్టమర్‌లను సంపాదించడానికి.. అలాగే గ్రూప్‌లోని హోటల్ ప్రాపర్టీలలో ఉండేందుకు.. ఇప్పటికే ఉన్న కస్టమర్‌లను నిలుపుకోవడానికి ప్రోగ్రామ్‌ను అందిస్తున్నాయి. ఈ ప్రోగ్రామ్‌లో ఇద్దరు వ్యక్తులు ప్రయోజనం పొందే వీలుంటుంది. భారతదేశంలోని మారియట్ బోన్‌వాయ్, అకార్ లైవ్ లిమిట్‌లెస్, అకార్ ప్లస్, తాజ్ ఎపిక్యుర్, క్లబ్ ఐటీసీ తదితర ప్రసిద్ధ హోటల్స్ లాయల్టీ ప్రోగ్రామ్‌లో ఉన్నాయి.
ఏ కార్డులపై అంటే..
ఈ హోటల్ లాయల్టీ ప్రోగ్రామ్‌లో గది ధర, ఫుడ్, డ్రింక్స్, స్పా ఇతర సేవలపై తగ్గింపు ధరలు అందుబాటులో ఉన్నాయి. అంతే కాదు అడ్వాన్స్‌డ్ చెక్ ఇన్, లేట్ చెక్ అవుట్ చేసే సౌకర్యం సైతం ఈ ప్రోగ్రామ్‌లో అందుబాటులో ఉంటుంది. అంతే కాకుండా లాంజ్‌ని ఉపయోగించుకునే వీలుంటుంది. దానికి ఎలాంటి రుసుంను వసూలు చేయరు. ఈ ప్రోగ్రామ్‌లో యాక్సిస్ బ్యాంక్, ఎస్‌డీఎఫ్‌సీ బ్యాంక్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ కార్డ్‌లపై డిస్కౌంట్స్ అందుబాటులో ఉన్నాయి.
ఈ ఆఫర్‌లో ఫ్రీగానే అకామిడేషన్ ఇవ్వనున్నారు. అయితే, ఫుడ్, ఇతర సేవల కోసం ఛార్జీలు వసూలు చేస్తుంటారు. పూర్తి వివరాల కోసం మీరు వినియోగిస్తున్న క్రెడిట్‌కార్డుకు చెందిన బ్యాంకులను సంప్రదించి ఆఫర్‌కు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. మరి మీరు కూడా ఈ మూడు కార్డులు వినియోగిస్తున్నట్టయితే.. న్యూ ఇయర్‌కు ఎటైనా వెకేషన్‌కు వెళ్లాలనుకుంటే లాయల్టీ ప్రోగ్రామ్‌ను ట్రై చేయండి మరి..!