Credit Cards | పర్సనల్ క్రెడిట్ కార్డు అప్లికేషన్లు ఎందుకు రిజెక్టు అవుతాయి?

పర్సనల్ లోన్ లేదా క్రెడిట్ కార్డు కోసం ధరఖాస్తు చేస్తే రిజెక్టు అయ్యాయా? మీ అప్లికేషన్ తిరస్కరించడానికి కారణాలు తెలుసా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే పర్సనల్ లేదా క్రెడిట్ కార్డు అప్లికేషన్స్ రిజెక్టు కాకుండా ఉంటాయో తెలుసుకుందాం.

Reported by: chinna | వాణిజ్యం | Nov 29, 2025, 8:10 pm IST
Read Time: 6 mins
Credit Cards | పర్సనల్ క్రెడిట్ కార్డు అప్లికేషన్లు ఎందుకు రిజెక్టు అవుతాయి?

మెరుగైన క్రెడిట్ స్కోర్ లేకపోతే

పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డు కోసం ధరఖాస్తు కోసం మీరు ధరఖాస్తు చేస్తే బ్యాంకులు లేదా ఆర్ధిక సంస్థలు మీ క్రెడిట్ హిస్టరీని చెక్ చేస్తాయి. గతంలో మీరు రుణాన్ని తీసుకొని సరిగా చెల్లించకపోవడం, సమాయానికి లోన్లు, బిల్లులు కట్టకపోవడం వంటివి కూడా మీ క్రెడిట్ హిస్టరీలో రికార్డు అవుతాయి. అంతేకాదు మీ క్రెడిట్ స్కోర్ పై కూడా ప్రభావితం చేస్తాయి. పర్సనల్ లోన్ లేదా క్రెడిట్ కార్డులకు ధరఖాస్తు చేసే ముందు మీ క్రెడిట్ స్కోర్ 750 పాయింట్లు ఉండేలా చూసుకోవాలి. క్రెడిట్ స్కోర్ మెరుగ్గా ఉన్నా కొన్ని సమయాల్లో మీ పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డు ధరకాస్తులు రిజెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. క్రెడిట్ స్కోర్ ఒక్కటే కాదు… ఇంకా చాలా విషయాలను బ్యాంకులు పరిశీలిస్తాయి.

మీ ఆదాయం ఎంత?

పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డు కోసం ధరఖాస్తు చేసిన వెంటనే మీ ఆదాయం ఎంత అనే విషయాన్ని బ్యాంకులు లేదా ఆర్ధిక సంస్థలు పరిశీలిస్తాయి. మీకు స్థిరమైన ఆదాయం ఉందా అనే విషయాన్ని ఆరా తీస్తారు. బ్యాంకులు లేదా రుణం ఇచ్చే సంస్థల నిబంధనల మేరకు మీ ఆదాయం లేకపోతే కూడా మీ అప్లికేషన్ రిజెక్టు చేస్తారు. రెగ్యులర్ ఆదాయం లేకపోతే అంటే మీరు చేస్తున్న ఉద్యోగం విషయంలో బ్యాంకులకు అనుమానాలు ఉంటే కూడా ధరఖాస్తును పక్కన పెట్టే అవకాశం ఉంది. మీరు ఫ్రీలాన్సింగ్ చేసినా కూడా మీ అప్లికేషన్ ను పక్కన పెట్టే ఛాన్స్ ఉంది.

ఈఎంఐలకు ఎంత చెల్లిస్తున్నారు?

ఇప్పటికే మీరు లోన్ తీసుకొని ప్రతి నెల ఈఎంఐ చెల్లిస్తుంటే ఆ విషయాన్ని కూడ పరిగణనలోకి తీసుకుంటారు. మీరు ప్రస్తుతం చెల్లించే ఈఎంఐ ఎంత ఉంది? మీ క్రెడిట్ కార్డు బిల్లులు క్రెడిట్ కార్డు పరిమితిలో 40 నుంచి 50 శాతం కంటే ఎక్కువ తీసుకుంటే అప్పుడు మీ ధరఖాస్తు రిజెక్టు చేసే అవకాశాలు ఎక్కువ.

డాక్యుమెంటేషన్ సరిగా లేకపోతే….

మీరు లోన్ కోసం, క్రెడిట్ కార్డు కోసం ఇచ్చిన ధరఖాస్తు సరిగా లేకపోయినా కూడా ఇబ్బందులు తప్పవు. కేవైసీ పత్రాలు సరిగా లేకపోవడం, సంతకాలు సరిపోలకపోవడం, పాత శాలరీ సర్టిఫికెట్లు జత చేయడం, పాన్, ఆధార్, ఆదాయానికి సంబంధించిన పత్రాలు జతపర్చకపోవడం… ఒకవేళ జతపర్చినా అవి సక్రమంగా లేకపోయినా కూడా మీ ధరఖాస్తును రిజెక్టు చేసే అవకాశం ఉంది. అంతేకాదు తక్కువ కాలంలోనే ఎక్కువ బ్యాంకులు లేదా ఆర్ధిక సంస్థల్లో రుణం కోసం ధరఖాస్తు చేసినా లేదా రుణం కోసం విచారణ చేసినా కూడా మీ ధరఖాస్తును పక్కన పెడతారు.

వయస్సు కూడా కీలకమే….

లోన్, క్రెడిట్ కార్డు కోసం ధరఖాస్తు చేయాలంటే కనీస వయస్సు 18 ఏళ్లు. అయితే ఈ వయస్సున్న వారు లోన్, క్రెడిట్ కార్డు కోసం ధరఖాస్తు చేస్తే వారికి ఆదాయ వనరు ఏంటనే విషయాన్ని బ్యాంకులు పరిశీలిస్తాయి. మరో వైపు రిటైర్మెంట్ కు దగ్గరల్లో ఉన్న ఉద్యోగులు ధరఖాస్తు చేసినా కూడా లోన్ మంజూరుకు బ్యాంకులు అంతగా ఆసక్తి చూపకపోవచ్చు.

Also Read- Inspiring | కార్పొరేట్ ఉద్యోగం వదిలి.. ఆటో డ్రైవర్‌గా మారిన యువకుడు
Palash Muchhal & Smriti Mandhana : దిష్టి రక్ష ఎమోజీతో పెళ్లి రద్దు వార్తలకు స్మృతి-పలాశ్‌ చెక్!
Human Bathing Machine | స్నానం చేయించే మెషీన్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?