Inspiring | కార్పొరేట్ ఉద్యోగం వదిలి.. ఆటో డ్రైవర్‌గా మారిన యువకుడు

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగులు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. దీని వల్ల కొందరు తమ వ్యక్తిగత జీవితాలతో పాటు అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.  తమకున్న ఆర్థిక సమస్యలను నెట్టుకురావడానికి ఉద్యోగం చేయడం ఇష్టం లేకున్నా బలవంతంగా చేయాల్సి వస్తోంది.

Reported by: chinna | ట్రెండింగ్ | Nov 29, 2025, 7:29 pm IST
Read Time: 5 mins
Inspiring | కార్పొరేట్ ఉద్యోగం వదిలి.. ఆటో డ్రైవర్‌గా మారిన యువకుడు

విధాత, హైదరాబాద్ :

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగులు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. దీని వల్ల కొందరు తమ వ్యక్తిగత జీవితాలతో పాటు అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.  తమకున్న ఆర్థిక సమస్యలను నెట్టుకురావడానికి ఉద్యోగం చేయడం ఇష్టం లేకున్నా బలవంతంగా చేయాల్సి వస్తోంది. ఈఎంఐలు, రోజువారి ఖర్చులు, ఇతర అవసరాల కోసం ఉద్యోగాలు చేస్తున్నవారేందరినో రోజూ చూస్తుంటాం. ఈ క్రమంలో ఒకరికింద బతకండం ఇష్టం లేని ఓ యువకుడు కార్పొరేట్ ఉద్యోగం వదిలి ఆటో డ్రైవర్ గా మారాడు. ఆ వ్యక్తికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలేసి ఆటో డ్రైవర్‌గా కొత్త జీవితం మొదలుపెట్టిన రాకేశ్ అనే యువకుడు తన నిజాయితీతో నిండిన వీడియోతో వేల మందికి ప్రేరణగా నిలుస్తున్నాడు.

రాకేష్‌ తన ఆకుపచ్చ-పసుపు రంగు ఆటోలో నగర వీధుల్లో ప్రయాణిస్తూ ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. జీవితంలో నిలిచిపోయినట్లు భావించే వారికి ధైర్యం చెప్పేలా మాట్లాడిన ఆయన సందేశం అనేక మందిని కదిలించింది. “ఇది నేను… ఆటో నడుపుతున్నాను. మళ్లీ మొదలుపెట్టడానికి నాకు భయం లేదు,” అంటూ వీడియోను ప్రారంభిస్తాడు. “జీవితం ముగిసిపోయినట్లుగా అనిపిస్తున్నవారికోసం ఈ సందేశం. నేను కూడా అలానే అనుకున్నాను. నేను ఎన్నడూ తిరిగి లేవనని భావించాను,” అని నిజాయితీగా ఒప్పుకున్నాడు.

 

View this post on Instagram

 

A post shared by Rakesh Auto Driver (@rak.shot)

“కానీ ఇవాళ నేను ఆటో నడుపుతున్నాను. జీవితం నన్ను ఓడించలేదు… ఇక ఓడించదు కూడా. ఏ సమస్య వచ్చినా ఎదుర్కొంటా,” అని ధైర్యంగా చెబుతున్నాడు రాకేష్‌. సమస్యల నుండి పారిపోకుండా వాటిని ఎదుర్కోవాలని, జీవితం వైపు తిరిగి చూడాలని ఆయన సూచించాడు. డబ్బు అవసరమే అయినా జీవితం అంతా డబ్బు చుట్టూ తిరగకూడదని రాకేష్‌ అభిప్రాయపడ్డాడు. మనస్ఫూర్తిగా, మనసుకున నచ్చే పని చేయడం, జీవితానికి నిజమైన అర్థం ఏమిటో వెతికే ప్రయత్నం చేయాలని చెప్పాడు. “మనసు పెట్టి ఏదో ఒకటి చేయండి. జీవించండి… మిగతా విషయాలు అవే సర్దుకుంటాయి,” అని చెప్పాడు.

వీడియో చివర్లో… “రండి… నాతో పాటు నడవండి. జీవితాన్ని ఎదుర్కొండి. దాని నుండి పారిపోకండి,” అని మరోసారి ధైర్యం ఇచ్చాడు రాకేశ్. కాగా ఈ వీడియో విపరీతంగా వైరల్ అయింది. కార్పొరేట్ ఒత్తిడికి లొంగిపోకుండా కొత్త జీవితం ఆరంభించినందుకు ఆయనను కొనియాడుతున్నారు. ‘జాబ్ టైటిళ్లు, జీతాలకే విలువ ఇచ్చే ప్రపంచంలో… ఇలా గౌరవంగా కొత్త జీవితం మొదలుపెట్టడం చాలా అరుదు’ అని పలువురు కామెంట్లు చేస్తున్నారు.

Also Read-Airbus A320 | అంతరాయం కలిగిస్తున్న ఆరు వేల ఎయిర్‌బస్‌ల రీకాల్..
Telangana | విద్యుత్ ఉత్పత్తిని పెంచకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు : డిప్యూటీ సీఎం భట్టి
Telangana Cabinet : త్వరలో…తెలంగాణ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ !?