Airbus A320 | అంతరాయం కలిగిస్తున్న ఆరు వేల ఎయిర్‌బస్‌ల రీకాల్..

ఏ320 విమానాల ప్రయాణాల్లో తరచూ అంతరాయం కలుగుతున్నదని ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఎయిర్‌బస్‌ కీలక నిర్ణయం తీసుకున్నది. సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ కోసం సుమారు ఆరువేల ఏ320 విమానాలను వెనక్కు రప్పిస్తున్నది.

Reported by: Jagan Mohan Talluri | అంత‌ర్జాతీయం | Nov 29, 2025, 6:38 pm IST
Read Time: 5 mins
Airbus A320 | అంతరాయం కలిగిస్తున్న ఆరు వేల ఎయిర్‌బస్‌ల రీకాల్..

Airbus A320 | ఎయిర్ బస్. ప్రపంచంలో అతి పెద్ద విమానాల తయారీ సంస్థ. ఏ320 విమానాలు ప్రపంచవ్యాప్తంగా అంతరాయం కలిగిస్తున్నట్లు వెల్లడికావడంతో వెనక్కి (రీకాల్) రప్పించాలని ఆ కంపెనీ నిర్ణయం తీసుకున్నది. ఇండియాతో పాటు ఇతర దేశాల నుంచి సుమారు 6వేల ఏ320 విమానాలను వెనక్కి రప్పిస్తున్నారు. విమానాశ్రయాల్లో విమానం వెనక్కి వెళ్లేందుకు పాత సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నారు. దీని స్థానంలో కొత్త సాఫ్ట్‌వేర్‌ అప్‌లోడ్‌ చేస్తే యథావిధిగా నడపడానికి ఇబ్బందులు ఉండవని తనిఖీల్లో తేలింది. 55 సంవత్సరాల కంపెనీ చరిత్రలో ఇంత భారీ సంఖ్యలో విమానాలు వెనక్కి రప్పించడం ఇదే తొలిసారి అంటున్నారు. ఈ మోడల్ విమానం బోయింగ్ 737 ను వెనక్కి నెట్టేసి ప్రపంచ విమానయాన రంగంలో ముందంజలో ఉన్నది. సాంకేతిక సమస్య కారణంగా అమెరికన్ ఎయిర్ లైన్స్, విజ్ ఎయిర్ వంటి విమానయాన సంస్థలు నిరంతరం సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఫలితంగా రాకపోకల్లో ఆలస్యం కావడం, రద్ధు కావడం జరుగుతున్నాయి.

సోలార్ రేడియేషన్ కారణంగా ఆపరేషన్ లో ముఖ్యమైన విమాన కంట్రోల్ సిస్టమ్‌లో అనుకోకుండా మరమత్తులు వస్తున్నాయి. అనుకోకుండా, అకస్మాత్తుగా వస్తున్న మరమత్తుల కారణంగా మెక్సికో, న్యూజెర్సీ లో అక్టోబర్ 30వ తేదీన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. విమానం అదుపు తప్పుతుండడం, నియంత్రణలోకి రాకపోవడంతో టంపా, ఫ్లోరిడా లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసిన విషయం విధితమే. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తనిఖీల్లో సాంకేతిక సమస్యలు వెల్లడి కావడంతో రీకాల్ చేయాలని కంపెనీ వెంటనే నిర్ణయం తీసుకున్నది. విమానాశ్రయాల్లో తాత్కాలిక మరమత్తులకు కూడా అధిక సమయం తీసుకుంటుండం మూలంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రతినిత్యం 1వేయి విమానాలపై ప్రభావం చూపిస్తున్నదంటున్నారు.

ఈ సమస్యను అధిగమించేందుకు కొన్నిసార్లు హార్డ్ వేర్ పార్ట్ లను కూడా మార్చివేస్తున్నా శాశ్వత పరిష్కారం లభించడం లేదు. ఏ320 విమానాల్లో సాఫ్ట్ వేర్ లోపం కారణంగా ఫిన్ ఎయిర్ సంస్థ తన విమానాలను గంట పాటు ఆలస్యంగా నడుపుతున్నారని ప్రయాణీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి రోజు 5 శాతం అనగా 35 విమానాలను రద్ధు చేస్తున్నామని ఏయిర్ ఫ్రాన్స్ ప్రకటించింది. 72 గంటల పాటు ఆలస్యంగా లేదా రద్ధు చేస్తున్నామని మెక్సికో కు చెందిన వొలారిస్ ఎయిర్ లైన్స్ పేర్కొంది.

Read Also |

Rohit Vemula Bill | మూడేళ్ల జైలు శిక్ష.. విద్యా సంస్థపై పది లక్షల జరిమానా! అసెంబ్లీలో రోహిత్‌ వేముల బిల్లు పెట్టనున్న కర్ణాటక ప్రభుత్వం
Bike Taxi Driver : రాపిడో డ్రైవర్ ఖాతాలో రూ.331 కోట్లు
Stored Dough | దాచిన రొట్టెల పిండిని వాడటం మంచిదేనా?