Excise Duty On Petrol Cut | బిగ్ రిలీఫ్.. పెట్రోట్, డీజిల్ లపై అదనపు ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు

పెట్రోల్‌, డీజిల్‌పై విధిస్తున్న అదనపు ఎక్సైజ్‌ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. పశ్చిమాసియాలో యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొన్నవేళ భారత్ లో ఇంధన ధరల నియంత్రణకు భారత ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకొంది.

Excise Duty On Petrol Cut

న్యూఢిల్లీ : పెట్రోల్‌, డీజిల్‌పై విధిస్తున్న అదనపు ఎక్సైజ్‌ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. పశ్చిమాసియాలో యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొన్నవేళ భారత్ లో ఇంధన ధరల నియంత్రణకు భారత ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకొంది. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ భేటీ కంటే ముందే.. కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం విశేషం.

కేంద్రం ఉత్వర్వుల మేరకు పెట్రోల్ లీటర్ పై సెంట్రల్ ఎక్సైజ్ సుంకాన్ని 13 నుంచి రూ.3కు తగ్గించడా.. డీజిల్‌పై రూ.10ని పూర్తిగా తొలగించింది. ఈ తగ్గింపు తక్షణమే అమల్లోకి వస్తుందని కేంద్రం తెలిపింది. ఈ నిర్ణయంతో చమురు మార్కెటింగ్‌ కంపెనీలకు భారీ ఊరట లభించనుంది. రాష్ట్రాల సీఎంతో నిర్వహించే సమావేశంలో ప్రధాని మోదీ సమావేశంలో.. రాష్ట్ర ప్రభుత్వ సెస్ లు తగ్గించాలని సూచన చేసే అవకాశం ఉందని..అందుకు ముందుగా కేంద్రం తనవంతుగా అదనపు ఎక్సైజ్ డ్యూటీని తగ్గించినట్లుగా తెలుస్తుంది.

ధరల నియంత్రణకు కేంద్రం చర్యలు

ఇరాన్‌ యుద్ధం కారణంగా హర్మూజ్‌ జలసంధి దాదాపు మూతపడటంతో ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు సరఫరాలో ఆటంకాలు ఏర్పడి, ధరలు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. తాజాగా బ్రెంట్‌ క్రూడ్‌ ధర మళ్లీ 100 డాలర్లు దాటినప్పటికి దేశీయంగా పెట్రోల్‌, డీజిల్‌పై ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో దేశీయ చమురు మార్కెటింగ్‌ కంపెనీలు లీటర్‌ పెట్రోల్‌/డీజిల్‌పై దాదాపు రూ.48 వరకు నష్టపోతున్నట్లు మార్కెట్‌ నిపుణులు వెల్లడించారు. మరోవైపు అదనపు భారాన్ని తగ్గించుకునేందుకు ఇటీవల నయారా ఎనర్జీ ఇంధన ధరలను పెంచేసింది. మిగతా చమురు కంపెనీలు కూడా అలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండటంతో.. కేంద్రం ఎక్సైజ్‌ సుంకాలపై ఇంధన సంస్థలకు ఊరట కల్పించింది. ఈ నిర్ణయంతో రిటైల్‌ మార్కెట్‌లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తక్షణమే తగ్గే అవకాశం లేనప్పటికీ.. ఇంధన ధరల భారాన్ని కంపెనీలు ప్రజల పైకి బదిలీ చేయకుండా ఈ చర్య కొంతమేరకు ఉపకరిస్తుందని పరిశ్రమ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

ఇంధన ఎగుమతులపై పన్ను విధించిన కేంద్రం

పెట్రోల్, డీజిల్ ధరల నియంత్రణకు కేంద్రం అదనపు ఎక్సైజ్ డ్యూటీని తగ్గించాలని నిర్ణయించడంతో పాటు ఇంకోవైపు రిఫైనరీలు విదేశాలకు ఎగుమతి చేసే పెట్రోల్‌, డీజిల్‌, ఏటీఎఫ్‌పై పన్ను విధించింది. డీజిల్‌పై లీటర్‌కు రూ.21.5, విమాన ఇంధనం ఏటీఎఫ్‌పై లీటర్‌కు రూ.29.5కు పెంచింది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురీ వివరాలు వెల్లడించారు. ఇంధన ధరల నియంత్రణకు ఈ చర్యలు దోహదం చేస్తాయని కేంద్రం భావిస్తున్నట్లుగా తెలిపారు.

ఇవి కూడా చదవండి :

Road Rage In Jaipur | స్కూటీని తాకిందని..బుల్లెట్ బైక్ పై యువతి దాడి!
Icecream Ban In Villages | మా ఊరిలో ఐస్ క్రీమ్ అమ్మితే రూ. 5,000/- జరిమానా.!

Latest News