Chhote Lal Mahato | 20 ఏండ్లుగా ఎన్నికల బరిలో ‘గ్యాస్ డెలివరీ మ్యాన్’.. ఈసారైనా గెలిచేనా..?
Chhote Lal Mahato | ఎన్నికల్లో( Elections ) పోటీ చేయాలనే ఆశ అందరికీ ఉంటుంది.. ఆపై గెలవాలనే తపన కూడా ఉంటుంది. కానీ గెలుపు( Win ) కొందరికే సాధ్యమవుతుంది. అయితే ఓ గ్యాస్ డెలివరీ మ్యాన్( Gas Delivery Man ) మాత్రం గత 20 ఏండ్లుగా ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఉన్నారు. పంచాయతీ ఎన్నికల( Local Body Elections ) నుంచి మొదలుకుంటే పార్లమెంట్ ఎన్నికల( Parliament Elections ) వరకు ప్రతి ఎన్నికల్లో పోటీ చేస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు చోటే లాల్ మహతో(Chhote Lal Mahato ). ఇప్పటి వరకు ఏ ఒక్క ఎన్నికలోనూ అతను గెలుపొందలేదు. తాజాగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో( Bihar Assembly Elections ) పోటీ చేసేందుకు ఆ గ్యాస్ డెలివరీ మ్యాన్ మరోసారి సిద్ధమయ్యాడు.

Chhote Lal Mahato | బీహార్( Bihar )లోని కిషన్‌గంజ్ నియోజకవర్గానికి( Kishanganj constituency ) చెందిన చోటే లాల్ మహతో(Chhote Lal Mahato ) వృత్తిరీత్యా గ్యాస్ డెలివరీ మ్యాన్( Gas Delivery Man ). ఈ వృత్తిలో కొనసాగుతున్నప్పటికీ అతనికి ప్రజా సేవ చేయాలనే సంకల్పం ఉంది. దీంతో 2004 నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఎన్నికలో అతను పోటీ చేశాడు. కానీ మహతో కల నెరవేరలేదు. పంచాయతీ, మున్సిపాలిటీ, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో స్వతంత్య్ర అభ్యర్థి( Independent Candidate )గా పోటీ చేస్తూ వస్తున్నాడు. తాజాగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో( Bihar Assembly Elections ) మరోసారి పోటీకి సిద్ధమయ్యాడు.
ఈ సందర్భంగా చోటే లాల్ మహతో మాట్లాడుతూ.. తనకు 23 ఏండ్ల వయసున్నప్పుడు తొలిసారిగా 2000 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశాను. కానీ వయసు రీత్యా తన నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. మళ్లీ 2004 ఎన్నికల్లో బరిలో దిగాను. అప్పట్నుంచి ఇప్పటి వరకు ఏ ఎన్నిక జరిగినా పోటీలో ఉంటున్నాను. వెను తిరిగి చూడలేదు. కానీ ప్రతి ఎన్నికలో ఓటమి చవిచూస్తున్నాను. అయినా కూడా తన సంకల్పం తనను ముందుకు నడిపిస్తుందన్నాడు. ఇక తన నియోజకవర్గ ప్రజలు తనకు ఎంతో మద్దతు ఇస్తున్నారని, ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆర్థికంగా కూడా సాయం చేస్తున్నారని తెలిపాడు. సీమాంచల్ గాంధీగా పేరుగాంచిన తస్లీముద్దీన్, మాజీ కేంద్ర మంత్రి సయీద్ షానవాజ్ హుస్సేన్ మీద గతంలో పోటీ చేసినట్లు పేర్కొన్నాడు మహతో. ఈ ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తానన్న నమ్మకం తనకు ఉంది. ప్రజలు తనకు స్వచ్ఛందంగా ఓట్లేసి గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చోటే లాల్ మహతో ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఇక తన భార్య కూడా తనకు ఎంతో మద్దతుగా ఉందన్నాడు మహతో. మేకలు, కోళ్లు, వాటి గుడ్లు విక్రయించి డబ్బు పోగు చేసి ఎన్నికల కోసం తన భార్య ఖర్చు పెడుతుందని ఆయన పేర్కొన్నాడు. తాను ఈ ఎన్నికల్లో గెలిస్తే పేదరికంలో మగ్గుతున్న కుటుంబాలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తాను. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తానని చోటే లాల్ మహతో స్పష్టం చేశాడు.