Robbed | రోజమ్మ బ‌ట్ట‌లు ఆరేస్తుండగా.. రూ. 4.6 ల‌క్ష‌లు చోరీ..

Robbed | ఓ మ‌హిళ( Woman ) ఉతికిన బ‌ట్ట‌లు( Clothes ) ఆరేసేందుకు వెళ్లింది. ఇదే అదునుగా భావించిన దొంగ‌( Thief  ).. ఆమె ఇంట్లోకి ప్ర‌వేశించి భారీగా న‌గదు( Money )దోచుకెళ్లాడు.

Robbed | రోజమ్మ బ‌ట్ట‌లు ఆరేస్తుండగా.. రూ. 4.6 ల‌క్ష‌లు చోరీ..

Robbed | ఓ మ‌హిళ( Woman ) ఉతికిన బ‌ట్ట‌లు( Clothes ) ఆరేసేందుకు వెళ్లింది. ఇదే అదునుగా భావించిన దొంగ‌( Thief  ).. ఆమె ఇంట్లోకి ప్ర‌వేశించి భారీగా న‌గదు( Money )దోచుకెళ్లాడు. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క( Karnataka ) రాజ‌ధాని బెంగ‌ళూరు( Bengaluru ) న‌గ‌రంలో మే 7వ తేదీన చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. రోజమ్మ( Roja-mma ) అనే 56 ఏండ్ల మ‌హిళ‌.. బెంగ‌ళూరులోని బెట్ట‌డ‌స‌న‌పురాలో నివ‌సిస్తోంది. మే 7వ తేదీన మ‌ధ్యాహ్నం 12 గంట‌ల స‌మ‌యంలో బ‌ట్ట‌లు ఉతికింది. అనంత‌రం ఆ బ‌ట్ట‌ల‌ను టెర్ర‌స్ పై ఆరేసేందుకు వెళ్లింది. అయితే ఇంటికి తాళం వేయ‌లేదు.

దీన్ని గ‌మ‌నించిన దొంగ ఇంట్లోకి చొర‌బ‌డ్డాడు. 20 నిమిషాల వ్య‌వ‌ధిలో ఇంట్లో ఉన్న బంగారు ఆభ‌ర‌ణాలు, న‌గ‌దు దోచుకున్నాడు. మ‌ధ్యాహ్నం 12.20 గంట‌ల‌కు రోజ‌మ్మ కింద‌కు దిగి వ‌స్తుండ‌గా, త‌న ఇంట్లో నుంచి ఓ వ్య‌క్తి బ‌య‌ట‌కు వెళ్తుండ‌డాన్ని గ‌మ‌నించింది. అత‌ను త‌న ష‌ర్ట్ కింద ఏదో దాచి తీసుకెళ్తున్న‌ట్లు గ్ర‌హించింది.

ఇక ఇంట్లోకి అడుగుపెట్టిన రోజ‌మ్మ షాక్‌కు గురైంది. ఇంట్లో ఉన్న వ‌స్తువులు చెల్లాచెదురుగా ప‌డి ఉన్నాయి. అంత‌లోనే దొంగ జారుకున్నాడు. బంగారు క‌మ్మ‌లు, ముక్కు పుల్ల‌, వెండి ఆభ‌ర‌ణాల‌తో పాటు రూ. 2 వేల న‌గ‌దును దొంగ అప‌హ‌రించాడు. బంగారం, వెండి ఆభ‌ర‌ణాల విలువ రూ. 4.6 ల‌క్ష‌లు ఉంటుంద‌ని బాధితురాలు తెలిపింది. బాధితురాలు రోజ‌మ్మ ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.