Bihar Assembly Elections | రసకందాయంలో బీహార్ ఎన్నికలు.. భార్యాభర్తల మధ్య పోటాపోటీ..!
Bihar Assembly Elections | బీహార్ అసెంబ్లీ ఎన్నికలు( Bihar Assembly Elections ).. భార్యాభర్తల( Couples ) మధ్య చిచ్చు పెడుతున్నారు. ఇద్దరు భార్యలను కాదని ఓ ఇద్దరు భర్తలు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. అది కూడా తమ భార్యలపైనే. ఈ ఇద్దరు మహిళలు కూడా ప్రస్తుతం ఎమ్మెల్యేలు( MLAs ). భార్యలపైనే భర్తలు వేరే పార్టీల నుంచి పోటీకి దిగడం చర్చనీయాంశమైంది.

Bihar Assembly Elections | పాట్నా : బీహార్ అసెంబ్లీ ఎన్నికలు( Bihar Assembly Elections )రసకందాయంగా మారాయి. గెలుపే లక్ష్యంగా ఆయా పార్టీల అభ్యర్థులు పావులు కదుపుతున్నారు. చివరకు భార్యాభర్తల( Couples ) మధ్య కూడా గట్టి పోటీ నెలకొంది. నువ్వేంత అంటే నువ్వెంత అన్న స్థాయిలో భార్యాభర్తల మధ్య రాజకీయ ఘర్షణలు( Political Heat ) చోటు చేసుకుంటున్నాయి. నువ్వు పోటీకి పనికి రావు అంటే.. నువ్వే రాజకీయాలకు పనికి రావు అని బహిరంగ విమర్శలు చేసుకునే స్థాయికి దిగజారాయి భార్యాభర్తల మధ్య రాజకీయాలు.
బీహార్‌లోని మోకామా అసెంబ్లీ( Mokama ) నియోజకవర్గం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహించిన నీలం దేవీ( MLA Neelam Devi )పై ఈ సారి భర్త అనంత్ సింగ్( Anant Singh ) పోటీకి దిగాడు. జనతాదళ్ యునైటెడ్ పార్టీ( Janata Dal United) నుంచి ఆయన నామినేషన్ దాఖలు చేశాడు. వాస్తవానికి రాష్ట్రీయ జనతా దళ్ టికెట్( Rashtriya Janata Party )పై 2020 అసెంబ్లీ ఎన్నికల్లో అనంత్ సింగ్ మోకామా నియోజకవర్గం నుంచి గెలుపొందారు. కానీ ఆయుధ చట్టం కింద నమోదైన ఓ కేసులో అనంత్ సింగ్ జైలు పాలయ్యాడు. దీంతో అతని శాసనసభ సభ్యత్వం రద్దు అయింది. దీంతో మోకామాలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో ఆయన భార్య నీలందేవి ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. ఇక జైలు నుంచి విడుదలైన అనంత్ సింగ్.. తాను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. తన భార్య రాజకీయాలకు పనికిరాదని, నియోజవకర్గ ప్రజల్లో ఆమె తీవ్రమైన అసంతృప్తిని మూటగట్టుకున్నారని పేర్కొన్నారు. దీంతో భార్యాభర్తల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
ఇక గౌరబౌరం( Gaurabauram ) నియోజకవర్గంలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యే స్వర్ణ సింగ్( MLA Swarna Singh ) భర్త సుజిత్ సింగ్( Sujit Singh ) కూడా ఈ ఎన్నికల్లో బరిలో దిగారు. తన భార్యను కాదని సుజిత్ పోటీ చేస్తుండడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. ఆమె కూడా తాను పోటీలో ఉంటానని తెగేసి చెప్పింది. రెవెన్యూ సర్వీసు అధికారి అయిన సుజీత్ సింగ్ బీజేపీ( BJP ) నుంచి పోటీ చేస్తున్నారు. ఈయన తండ్రి సునీల్ కుమార్ మండలి మాజీ సభ్యుడు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో స్వర్ణ సింగ్ గౌరబౌరం నియోజకవర్గం నుంచి వికాస్‌శీల్ ఇన్‌సన్ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 7 వేల ఓట్ల మెజార్టీతో ఆమె విజయం సాధఙంచారు.