ICMR Report : ఇండియన్స్ తీసుకొనే ఆహారంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువ, ప్రోటీన్లు తక్కువ
భారతీయుల ఆహారంలో 62% కార్బోహైడ్రేట్లు అధికం, ప్రోటీన్లు తక్కువ: ఐసీఎంఆర్ సర్వే. ఊబకాయం, డయాబెటీస్‌కు కారణమవుతున్నాయని నిపుణుల హెచ్చరిక.

హైదరాబాద్, అక్టోబర్10(విధాత ప్రతినిధి): భారతీయులు తింటున్న ఆహారంలో ఎక్కువగా కార్పోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ఆహారంలో కార్బోహైడ్రేట్లు పరిమితికి మించితే లాభం కంటే నష్టమే ఎక్కువ అని నిపుణులు చెబుతున్నారు. ఇండియన్స్ తింటున్న రోజువారీ ఫుడ్ లో 62 శాతం కార్బోహైడ్రేట్స్ ఉన్నాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ తాజా సర్వే బయటపెట్టింది. రోజువారీ ఆహారంలో ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు తక్కువగా ఉన్నాయి. ఇది మధుమేహం, ప్రీడయాబెటీస్, ఊబకాయం వంటి వాటికి దారితీస్తోందని ఈ అధ్యయనం తెలిపింది. తీసుకొనే ఆహారంలో అన్ని రకాల పోషకాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఫుడ్‌లో కార్బోహైడ్రేట్ల వినియోగంలో టాప్ లో ఇండియా
ఐసీఎంఆర్-ఐఎన్‌డీఐఏబీ భారతీయుల రోజువారీ తీసుకొనే ఆహారంపై సర్వే నిర్వహించింది. దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో పాటు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఈ సర్వే నిర్వహించింది. సుమారు 1.21 లక్షల మందిని సర్వే చేసింది. రోజువారీ ఆహారంలో 62 శాతం కార్బోహైడ్రేట్లు ఉండడం ప్రపంచంలో ఇండియాలోనే అధికంగా ఉందని చెబుతున్నారు. ఈ కార్బోహైడ్రేట్లలో ఎక్కువగా తెల్ల బియ్యం, పిండి, చక్కెర నుంచి వస్తున్నాయి. దక్షిణ, తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో తెల్ల బియ్యం ఆధిపత్యం చెలాయిస్తుంది. ఉత్తర, మధ్య భారతదేశంలో గోధుమలు ఎక్కువగా వినియోగిస్తున్నారు. కర్ణాట, గుజరాత్ రాష్ట్రాల్లో చిరుధాన్యాలు ఆహారంలో భాగమయ్యాయి.
ఆహారంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువ ఉంటే నష్టం ఏంటి?
ఆహారంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువైతే టైప్ 2 డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఎక్కువ. ప్రీ డయాబెటీస్, ఊబకాయం వచ్చే అవకాశాలు 15 నుంచి 30 శాతం వరకు ఉంటాయి. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఆహారంలో ఉంటే ప్రొటీన్ల లోపం ఏర్పడే అవకాశం ఉంది. పాల ఉత్పత్తుల నుంచి 2 శాతం, జంతు ప్రొటీన్ల నుంచి 1 శాతం కేలరీలు వస్తాయి. ఆహారంలో కనీసం 15 శాతం ప్రోటీన్లు ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. దేశంలోని 21 రాష్ట్రాల్లో పరిమితికి మించి చక్కెరను ఉపయోగిస్తున్నారు. ఆరోగ్యకరమైన కొవ్వు (ఒమేగా-3 వంటివి) ను చాలా తక్కువగా ఉపయోగిస్తున్నారు. ఎక్కువగా కార్బోహైడ్రేట్లను తీసుకొన్న తర్వాత మిల్లెట్లకు మారినా మధుమేహ ప్రమాదాన్ని తగ్గించే అవకాశం లేదని పరిశోధకులు గుర్తించారు. మిల్లింగ్ గ్లైసెమిక్ సూచికను పెంచుతుంది. రోజువారీ ఆహారంలో కొంత కార్బోహైడ్రేట్లతో పాటు ప్రొటీన్ కూడా ఉండాలి. రక్తంలో చక్కెర నిల్వలను సమర్ధవంతంగా కాపాడుతుంది. అతిగా తినకుండా నిలువరిస్తుంది. ఎక్కువ సేపు కడుపు నిండి ఉన్నట్టు అనిపించడం వల్ల అతిగా భోజనం చేయకుండా ప్రొటీన్ కాపాడుతుంది.
ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహార పదార్ధాలు
గుడ్లు: సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండేది కోడిగుడ్డు. దీనిలో మంచి ప్రోటీన్లు ఉంటాయి.
పనీర్: కేసైన్ ప్రోటీన్, కాల్షియం సమృద్దిగా ఉంటుంది.
పెరుగు: పేగు ఆరోగ్యానికి ప్రొటీన్, ప్రొబయోటిక్‌ను అందిస్తుంది.
పప్పుధాన్యాలు: కాయధాన్యాలు, చిక్ పీస్, అన్నిరకాల పప్పుల నుంచి ప్రోటీన్లు లభిస్తాయి.
సోయా: ప్రోటీన్ అధికంగా, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి.
చేపలు: ప్రొటీన్, ఒమేగా -3 వంటి మంచి కొవ్వు లభిస్తుంది.
చికెన్: గ్రిల్డ్ చికెన్ లేదా ఆవిరితో ఉడికించినది అయితే ఉపయోగం.
నట్స్: బాదం, వాల్‌నట్స్, అవిసె గింజలు, చియా విత్తనాలతో ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తాయి.
బహుముఖంగా ఉంటాయి. మీరు ప్రయత్నించగల కొన్ని అవకాడో వంటకాలు ఇక్కడ ఉన్నాయి.
అనారోగ్యకరమైన కొవ్వును ఎలా తగ్గించాలి?
అధిక నెయ్యి, వెన్న, వనస్పతి వాడకం తగ్గిస్తే అనారోగ్యమైన కొవ్వును ఆహారం నుంచి మినహాయించవచ్చు. డీప్ ఫ్రై చేసిన ఆహార పదార్ధాలు, బేకరీల్లో ఉండే ఆహారంలో ఎక్కువగా ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. ప్రాసెస్ చేసిన స్నాక్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు. ఇవి తరచుగా నాణ్యత లేని నూనెలతో తయారు చేస్తారు. రోజువారీ ఫుడ్ లో కార్బోహైడ్రేట్లతో పాటు ప్రొటీన్లు, మంచి కొవ్వు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.