ఏం ధైర్యం రా బాబూ.. మొస‌లిని భుజాల‌పై మోసుకెళ్లిన యువ‌కుడు

ఏం ధైర్యం రా బాబూ.. మొస‌లిని భుజాల‌పై మోసుకెళ్లిన యువ‌కుడు

విధాత‌: మొస‌ళ్లు అతి భ‌యంక‌ర‌మైన‌వి. మ‌న‌షుల‌ను అమాంతం మింగేస్తాయి. అంత‌టి భ‌యంక‌ర‌మైన మొస‌లితో ఓ యువ‌కుడు డేంజ‌ర‌స్ స్టంట్ చేశాడు. మొస‌లిని త‌న భుజాల‌పై మోసుకెళ్లాడు. మొస‌లిని మోసినంత సేపు ఆ యువ‌కుడు బెద‌ర‌లేదు. వ‌ణ‌క‌లేదు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ల‌లిత్‌పూర్‌లో వెలుగు చూసింది.


స్థానికంగా ఉన్న ఓ కాలువ‌లో మొస‌లి ప్ర‌త్య‌క్ష‌మైంది. దాన్ని చూసి స్థానికులు తీవ్ర భయాందోళ‌న‌కు గుర‌య్యారు. దీంతో స్థానికుడైన ఓ యువ‌కుడు.. డేంజ‌ర్ స్టంట్‌కు పాల్ప‌డ్డాడు. ఇక కాలువ‌లోకి దిగి, ఆ మొస‌లిని బ‌య‌ట‌కు లాక్కొచ్చాడు. అమాంతం దాన్ని త‌న భుజాల‌పై కొంత దూరం వ‌ర‌కు మోసుకెళ్లాడు. అక్క‌డ మ‌రో యువ‌కుడు త‌న భుజాల‌పైకి తీసుకుని, ముందుకు వెళ్లేందుకు య‌త్నించ‌గా, అది ఎగిరింది.


దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. మొస‌లిని మోసిన యువ‌కుడిని రియ‌ల్ లైఫ్ బాహుబ‌లితో పోల్చుతున్నారు. మరి కొందరు మాత్రం అతడి తీరును విమర్శించారు. అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చి వారి సహాయంతో ఆ మొసలిని పట్టుకుంటే మంచిదని హితవు పలికారు. ఇలాంటి సాహసాలు ఒక్కోసారి ప్రమాదానికి దారి తీయవచ్చని హెచ్చరించారు.