Independence Day | ఇండిపెండెన్స్ డే రోజున అరుదైన దృశ్యం ఆవిష్కృతం.. వీడియో

Independence Day | మ‌న జాతీయ జంతువు పులి( Tiger ).. మ‌న జాతీయ ప‌క్షి నెమ‌లి( Peacock ).. అయితే ఈ రెండు క‌లిసి ఒకే ఫ్రేములో క‌నిపించ‌డం అసాధార‌ణం. కానీ ఓ అడ‌వి( Forest )లో మాత్రం ఈ రెండు క‌లిసి ఒకే ఫ్రేములో ద‌ర్శ‌న‌మిచ్చాయి. ఇది మ‌న జాతీయ స‌మ‌గ్ర‌త‌( Integrity )కు నిద‌ర్శ‌న‌మ‌ని నెటిజ‌న్లు పేర్కొంటున్నారు.

Independence Day | ఇండిపెండెన్స్ డే రోజున అరుదైన దృశ్యం ఆవిష్కృతం.. వీడియో

Independence Day | ఇండిపెండెన్స్ రోజు( Independence Day )న అరుదైన దృశ్యం ఆవిష్కృత‌మైంది. మ‌న జాతీయ జంతువు, మ‌న జాతీయ పక్షి.. ఓ అడ‌విలో ఒకే ఫ్రేములో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాయి. ముందు నెమ‌లి( Peacock ) న‌డుచుకుంటూ వ‌స్తుంటే.. దాని వెనుకాల పులి( Tiger ) ద‌ర్జాగా న‌డుచుకుంటూ చూప‌రుల‌ను ఆక‌ట్టుకుంది. నెమ‌లికి పులి ఏ మాత్రం హానీ క‌లిగించ‌లేదు.

ఈ వీడియోను ఉత్త‌రాఖండ్‌( Uttarakhand )కు చెందిన ఛీప్ క‌న్జ‌ర్వేట‌ర్ ఆఫీస‌ర్ డాక్ట‌ర్ పీఎం ద‌ఖాటే త‌న ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. అమేజింగ్ వీడియో.. మ‌న జాతీయ ప‌క్షి నెమ‌లి, జాతీయ జంతువు పులి క‌లిసి ఒకే ఫ్రేములో చూడ‌డం అద్భుతం అని ఆయ‌న పేర్కొన్నారు. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతుంది. నెమ‌లి, పులి ఒకే ఫ్రేములో ఆవిష్కృతం కావ‌డంతో నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు.