టిన్ డబ్బాలో చిక్కుకున్న ఎలుగుబంటి తల ..రక్షించిన ఆర్మీ

హిమాలయా పర్వత శ్రేణిలో ఎల్వోసీ సమీపంలోని ఓ మంచు పర్వతపు ఎలుగుబంటి తల టిన్‌ డబ్బాలో చిక్కుకోగా..భారత సైన్యం దానిని రక్షించడం వైరల్ గా మారింది.

హిమాలయా పర్వత శ్రేణిలో ఎల్వోసీ సమీపంలోని ఓ మంచు పర్వతపు ఎలుగుబంటి తల టిన్‌ డబ్బాలో చిక్కుకోగా..భారత సైన్యం దానిని రక్షించడం వైరల్ గా మారింది. పర్యాటకులు లేదా ఆ ప్రాంత వాసులు పడేసిన టిన్ డబ్బాలో ఆ ఎలుగుబంటి( హిమాలయన్ పిట్ వైపర్‌) తల పెట్టిన సందర్భంలో డబ్బాలో దాని తలకు చిక్కుకుంది. దీంతో తలకు చిక్కుకున్న డబ్బాతో ఏం కనిపించక…ఊపిరాడక ఆ ఎలుగుబంటి పర్వత ప్రాంతాల్లో అయోమయంగా సంచరిస్తూ…సరిహద్దు ముళ్ల కంచెలలో చిక్కుకుంటూ..ఎదురైన కొండలను, చెట్లను ఢీ కొంటూ  ప్రమాదాలకు గురవుతూ తీవ్ర ఇబ్బందుల పాలైంది. అది గమనించిన భారత సైన్యం ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి దానిని రక్షించారు.

ముందుగా ఆ ఎలుగుబంటిని ఓ వలలో బంధించి మత్తు ఇచ్చారు. అనంతరం దాని తలకు చిక్కుకున్న టిన్ డబ్బాను కట్ చేసి..డబ్బా నుంచి బంధ విముక్తిని కల్పించారు. దీంతో ఆ ఎలుగుబంటి గతంలో మాదిరిగానే హాయిగా పర్వత ప్రాంతాల్లో సంచరిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. డబ్బాలో చిక్కుకపోయిన ఎలుగుబంటిని రక్షించిన ఆర్మీ స్పెషల్ ఆపరేషన్ ను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

 

Latest News